Anchor Suma : పేరుకు మలయాళీ అయిన అచ్చ తెలుగు భాషతో అందరి మనసులను గెలుచుకున్న యాంకర్ సుమ. దాదాపు రెండు దశాబ్ధాలుగా బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. యాంకర్ సుమ అంటే తెలియని ప్రేక్షకులు ఎవరూ ఉండరు. బుల్లితెరపై క్వీన్ గా వెలుగుతోంది. స్టార్ మా, జెమినీ, ఈటీవీ, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో అయినా సరే ఎంటర్టైన్మెంట్ షో అంటే కచ్చితంగా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. తన చలాకీ మాటలతో షోను రంజింప చేసి సూపర్ హిట్ చేస్తుంది. నిజానికి సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో తొలుత నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ సినిమాల్లో అవకాశాలు రాలేదు. దాంతో వేరే భాషల్లో ఒకటి రెండు తీసినా పెద్దగా పేరు రాలేదు. దీంతో యాంకర్ గా ట్రై చేసి సక్సెస్ అయింది. ఇండస్ట్రీకి ఎంతో మంది యాంకర్లు వచ్చి వెళ్తున్నప్పటికీ తన స్టార్ యాంకర్ స్టేటస్ మాత్రం కదల్చలేకపోతున్నారు. అందుకే ఈమెను యాంకరింగ్ రంగంలో మెగాస్టార్ అంటుంటారు.
ఇక సుమ వ్యక్తిగత విషయాల్లోకి వస్తే నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పరిచయం కస్తూరి సీరియల్ ద్వారా జరిగింది. వీళ్ళ పెళ్లి అంత సులువుగా జరుగలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుమ తెలిపింది. ఈ సంబర్భంగా సుమ మాట్లాడుతూ రాజీవ్ కనకాలని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో చెప్పిందట. తర్వాత తమ కుటుంబ సభ్యులు ససేమీరా అన్నారట. అటు రాజీవ్ కుటుంబంలో సుమతో పెళ్లికి ఒప్పుకున్నారట. సుమ కుటుంబ సభ్యులు మాత్రం రాజీవ్ కనకాలతో మాట్లాడడానికి అసలు వీలు లేదని సుమను ఓ గదిలో పెట్టి తాళం వేసి వారం పాటు అందులోనే ఉంచారట. దీంతో రాజీవ్ నే తలుచుకుంటూ ఏమి తినకుండా అలాగే ఉండిపోయిందట.. చివరకి తనకుటుంబ సభ్యుల టార్చర్ తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోదాం అనుకుందట. కానీ చేసేదేంలేక చివరికి తన తల్లి దండ్రులు వారి ప్రేమను ఒప్పుకుని రాజీవ్ తో సుమను ఇచ్చి పెళ్లి చేశారని తెలిపింది. అలా వీరి దాంపత్య జీవితం ఇప్పటి వరకు చాలా అన్యోన్యంగా కొనసాగుతూనే ఉంది.