బన్నీకి తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కోలీవుడ్, మాలీవుడ్ ల్లో అయితే బన్నీకి సపరేట్ ఫ్యాన్స్ క్లబే ఉంది. ఇక దీంతో బన్నీని ఆయా భాషల్లో ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుతూనే ఉన్నారు. కానీ, మంచి కథ కోసం బన్నీ ఎదురుచూస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బన్నీ చుట్టూ ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కథ పట్టుకొని తిరుగుతున్నాడని టాక్ నడుస్తోంది.
అతను ఎవరో కాదు.. అట్లీ. రాజారాణి సినిమాతో వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేని హిట్ ను అందుకొని.. విజయ్ తో వరుసగా మూడు సినిమాలు చేసి హిట్ అందుకున్న అట్లీ.. బాలీవుడ్ లో జవాన్ తో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నే డైరెక్ట్ చెస్ అవకాశాన్ని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తూ.. బన్నీకి మంచి కథ ఉందని.. వినాలని కోరినట్లు సమాచారం. ఇది కనుక ఓకే అయితే ఐకాన్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీ.. జవాన్ డైరెక్టర్ తో.. అయ్యినట్టే.. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో గతంలో అల్లు అర్జున్ కోలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. అలవైకుంఠపురం సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన బన్నీ.. ‘‘నా తెలుగు చిత్రాలు డబ్ అయి యూట్యూబ్ వేదికగా హిందీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. నన్ను పరోక్షంగా బాలీవుడ్‌కి పరిచయం చేశాయి. అయినా నాకు మాత్రం ఇక్కడే (తమిళనాడు) గెలవాలనుంది. నా హోమ్ స్టేట్‌లో విజయం అందుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పాటల వల్ల ఈ సినిమా కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందుకు నా స్నేహితుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్’’ అని అన్నాడు.