ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన అనుష్క.. అలాంటివన్నీ సహజంగా జరగాలట..

- Advertisement -

చాలా సంవత్సరాల విరామం తర్వాత అనుష్క శెట్టి నటిస్తోన్న సినిమా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.తాజాగా అనుష్క ఓ ఆంగ్ల మీడియతో ఈ సినిమా సంగతులతో పాటు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు అన్విత. ఎంతో సానుభూతిపరురాలు. తన పనులు పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడుతుంది. అందరి లాంటి అమ్మాయి కాదు. ఎంతో ప్రత్యేకమైన అమ్మాయి. మంచి స్క్రిప్ట్‌ ఉన్న సినిమాలో నటించడం సవాలుతో కూడుకున్నది. నా కెరీర్‌లో దేవసేన (బాహుబలి), జేజమ్మ (అరుంధతి), భాగమతి లాంటి ఎన్నో ప్రత్యేకమైన పాత్రల్లో నటించాను. ఇప్పుడు అన్విత పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్స్‌ రావాలంటే అదృష్టం ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు నటనపై ఎలాంటి అవగాహన లేదు’’.

‘‘ఇప్పుడీ స్థాయికి వచ్చానంటే దీని వెనుక ఎంతో మంది సహాయం ఉంది. చాలా సినిమాలు చేసినప్పటికీ మొదటి రోజు సెట్‌కు ఎలా వెళ్లానో ఇప్పుడూ అలానే వెళ్తాను. నా పాత్రకు తగిన న్యాయం చేయగలనా అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. ఒక్కోసారి అందంగా కనిపించింది.. మరోసారి ఎంతో కఠినంగా అనిపించింది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఉన్న వారు నిరంతరం నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని అనుష్క చెప్పారు.

ఇక సినిమాల కోసం శరీరాకృతిలో మార్పు తీసుకురావడంపై అనుష్క మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్‌ ఉంటే దానికోసం ఎంత సాహసమైనా చేయాలనిపిస్తుందని అన్నారు. ఒక్కోసారి బరువు పెరగడం, తగ్గడం నటులకు ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని ఆమె తెలిపారు. అలాగే తన పెళ్లిపై కూడా అనుష్క స్పందించారు. వివాహ వ్యవస్థపై నమ్మకముందన్న అనుష్క.. పెళ్లికి తానెప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు. సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here