హ్యాపీడేస్ సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిన హీరోయిన్ తమన్నా భాటియా. సినిమా ఇండస్ట్రీలో లాంగ్ రన్ కెరీర్ కొనసాగిస్తున్న వారిలో తమన్నా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. సినీ ప్రేక్షకులతో మిల్కీ బ్యూటీగా పిలిపించుకుంటూ 18 సంవత్సరాలుగా ప్రేక్షకులను తన అందచందాలతో అలరిస్తోంది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అవకాశాలు తగ్గుతున్న తరుణంలో పలు రకాల వెబ్ సిరీస్లలో బోల్డ్ గా నటించి యువకుల గుండెలు బద్ధలు చేసింది.
బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో నటిస్తుండగా సహ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని బహిరంగంగానే ఇద్దరు ప్రకటించారు. రీసెంట్ గా ఇద్దరు కూడా మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లి వచ్చారు.గత కొద్దిరోజులుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్టీలు పబ్బులంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తరచూ బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన కామెంట్స్ వింటే తన ప్రియుడు విజయవర్మకు గుడ్ బై చెప్పబోతుందన్న సందేహాలు తలెత్తులున్నాయి.
తమన్నా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ మన అనుకునే వ్యక్తులు మాట్లాడిన మాటలు విన్నప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. చివరిగా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే ముఖ్యం’ అంటూ కూడా తెలియజేసింది తమన్నా. అయితే తమన్నా చేసిన ఈ కామెంట్స్ విజయ్ వర్మను ఉద్దేశంగా తీసుకునే అన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. మాల్దీవులకు వెళ్ళినప్పుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అందువల్లనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియాలి.