ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిలో పడింది. చేసిన ప్రతీ సినిమా హిట్ కావడంతో ముద్దుగుమ్మకు గోల్డెన్ లెగ్ ముద్ర పడింది. అంతే కాకుండా తన చలాకీ తనంతో యువకుల మనసులను దోచేసింది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. దీంతో బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకునేందుకు కష్టపడుతోంది రష్మిక మందన్నా. తాజాగా ఆమె హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సందడి చేసింది.

ఆరంజ్ రంగు చీరలో చాలా అందంగా ముస్తాబై కనిపించింది. సాయి బాబు వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. నూతన వధూవరులను ఆశీర్వదించింది. వారికి విషెష్ చెబుతున్న సందర్భంలో కొత్త దంపతులు రష్మిక కాళ్లపై పడడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి బాబు పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర ధర గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆరెంజ్ కలర్ చీర, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను రష్మిక ధరించింది. ఈ శారీని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ రష్మిక కట్టుకున్న ఆ శారీ ధర ఎంతో తెలుసా అక్షరాల 35 వేల రూపాయలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు అమ్మ బాబోయ్ అంటూ నోరెళ్ల బెడుతున్నారు. రష్మిక చీర చూసేందుకు చాలా సింపుల్ గా ఉండడంతో దాని ధర రూ.35వేలు అంటే నమ్మలేకపోతున్నారు. రష్మిక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ఒకటి. దాంతో పాటు యానిమల్, రెయిన్ బో, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన తన 51సినిమాలో హీరోయిన్ గా ఆమె సెలక్ట్ అయింది.