డాడీ సినిమాలో ఓ సాంగ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేసి ఎవరీ కుర్రాడు అదరగొట్టాడని అందరి కితాబు పొందిన యాక్టర్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టి చిత్ర పరిశ్రమలో తన కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక అర్య సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకున్నాడు. బన్నీతో స్టైలిష్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా కాకుండ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్నా వాటిపై ఎన్నడూ ఆధారపడలేదు. నటుడిగా, గొప్ప డ్యాన్సర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు.
పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ లో తన రేంజ్ అమాంతం పెంచుకున్నాడు. ఇటీవల ఆ సినిమాలో నటించినందుకు గానూ ఉత్తమ జాతీయ అవార్డును సైతం అందుకుని వార్తల ముఖ్యాంశాల్లో నిలిచాడు. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకు దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవాడో అని అందరూ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. అల్లు అర్జున్ చెన్నైలో పుట్టారు. తనకు పద్దేనిమిదేళ్లు వచ్చే వరకు అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు. ముందు నుంచి చదువుల్లో బన్నీ వీకే. కానీ ఆటపాటల్లో చాలా చురుకుగా ఉండేవాడు. చిన్న నాటి నుంచి పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. చదువు ఎలాగో అబ్బలేదు కాబట్టి పియానో టీచర్ గానైనా జీవితాంతం బతికేయవచ్చని బన్నీ అనుకునేవాడట. కానీ ఆ అవసరం ఆయనకు రాలేదు. టీనేజీ నుంచే బన్నీ డ్యాన్స్ నేర్చుకున్నాడు నటన తన మామ చిరంజీవి నుంచి నేర్చుకున్నాడు.