టాలీవుడ్ కుర్ర హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కోడలు అవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తో ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్వరలోనే పెళ్లి బంధంతో మెగా కోడలుగా అడుగుపెట్టబోతుంది. వరుణ్ తేజ్ – లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరు పెళ్లితో దంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి మరో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కు జోడిగా 2019లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటించింది. పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ మంచి విజయాలు సొంతం చేసుకుంటే.. అల్లు శిరీష్ మాత్రం ఇంకా సక్సెస్ రుచి చూడలేదు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లితో దంపతులు అవుతున్న వేళ సోషల్ మీడియాలో అల్లు శిరీష్.. లావణ్య త్రిపాఠికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇందులో శిరీష్.. లావణ్యను ప్రశంసలతో ముంచేత్తాడు. లావణ్య మంచి హౌస్ వైఫ్.. ఆమె చాలా బాగా వంట చేస్తుంది.. అందరిని బాగా చూసుకుంటుంది.. పిల్లలు, పెద్దల విషయంలో చాలా ఓపికగా, సహనంగా ఉంటుంది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. అయితే ఇది పాత వీడియో అని అర్థమవుతోంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి డిసెంబర్ లో జరిగే అవకాశం కనిపిస్తుంది.