మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఎంతమంది ఉన్నారో లెక్కించడం కష్టం. దశాబ్ధాలుగా ఆయన ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. దాదాపు నలభై ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో వందలమందికి ఆయన జీవితాన్ని ప్రసాదించారు. మధ్యలో రాజకీయాలంటూ పదేళ్లు సినిమాలకు దూరమై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆయన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన కత్తి మూవీకి రీమేక్. ఈ సినిమా విడుదలై చిరంజీవి కెరీర్లో తొలి 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ షేర్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది.
వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉందని చిత్ర దర్శకుడు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తను ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యానని.. నిజానికి తమిళ్ సినిమా కత్తిని టాలీవుడ్లో ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నాడట. ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కూడా చేయాలని ఆసక్తి చూపించారని చెప్పుకొచ్చాడు. కానీ విజయ్ ముందుగా కత్తి ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలనుకోవడం.. ఇందులో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా ఎంపిక చేయడం లాంటి కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని వివరించాడు. అయితే ఈ సినిమా నిరాశ మిగిల్చిన తర్వాత.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ కు కథ వినిపించారని.. దానిలో హింస ఎక్కువగా ఉండడంతో కుదరలేదని చెప్పారు. ఇదే కాకుండా 2016 – 17 సమయంలో కూడా ఎన్టీఆర్ గోపీచంద్ కాంబోలో మరో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. మరి భవిష్యత్తులోనైనా వీరి కాంబోలో సినిమా వస్తుందో రాదో చూడాలి.