Mannara Chopra : ప్రస్తుతం మనమంతా చుట్టూ కెమెరాల మధ్యలోనే బతుకుతున్నాం.. మనల్ని ఎవరు వీడియో తీస్తున్నారో కూడా తెలియదు. సెలబ్రిటీలు ఒక పనిచేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతారు. ఏదైనా చేయకూడని పని చేసి వీడియోలో రికార్డు అయ్యారో ట్రోలర్ రాయుళ్లకు పండగే. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఈ పేరంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్ సినిమాల దర్శకుడు అంటే వెంటనే గుర్తుకు వస్తారు. తాజాగా ఆయన చేసిన పనికి నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రవికుమార్ చౌదరీ, హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ‘తిరగడబారా సామి’ అనే సినిమాను తెరకెక్కించారు. రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో జక్కన్న, రోగ్ వంచి సినిమాల్లో నటించిన మన్నారా చోప్రా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో దర్శకుడు ఏఎస్ రవి కుమార్.. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దుపెట్టాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇలా హీరోయిన్ తో ఆ చిలిపి చేష్టలు చేయడం పద్ధతి కాదంటున్నారు. అంతటితో ఆగకుండా ఇలాంటి వాళ్లను ఊరికే వదిలి పెట్టకూడదని కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్లు ఇలాంటి వాటిపై రియాక్ట్ అవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. ఓసారి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టగా.. అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చివరకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మరీ దర్శకుడు ఏఎస్ రవికుమార్ తను చేసిన పనికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో వెయిట్ చేసి చూడాలి.