అతిపెద్ద సీక్రెట్ చెప్పేసిన తమన్నా.. అమ్మడి యవ్వారం మాములుగా లేదుగా..

- Advertisement -

మిల్కీబ్యూటీ తమన్నా తన గ్లామర్​ సీక్రెట్స్​ రివీల్​ చేసింది. అందంగా ఉండటం అంటే గ్లామర్​గా ఉండటం మాత్రమే కాదని ఫిట్​నెస్​ కూడా ఉండాలని తెలిపింది. ఈ రెండూ బ్యాలెన్స్​ చేసుకోవడం వల్లే ఫిట్​గా ఉన్నట్టు వివరించింది. ఇక తన డైట్​ గురించి చెప్తూ.. ‘రోజులో 12 గంటలు ఏం తినకుండా ఉంటాను. మరో 12 గంటల్లో సాయంత్రం 6లోపే డిన్నర్​ ముగించేస్తాను. ఉదయం డ్రైఫ్రూట్స్​, అరటిపండ్లు, ఖర్జూరం వంటివి బ్రేక్​ఫాస్ట్​లో ఉండాల్సిందే.

మధ్యాహ్నం బ్రౌన్​ రైస్​, పప్పు, కూరగాయలతో సాత్విక భోజనం ఉండేలా చూసుకుంటాను. దీంతో పాటు ఉసిరిక జ్యూస్​, గ్రీన్​ టీ రెగ్యులర్​గా తీసుకోవడం తన నిగారింపును కాపాడతాయి. ఇక జిమ్​కి వెళ్లే విషయంలో అస్సలు బద్దకించను’ అని తమన్నా తెలిపింది. వర్కవుట్స్​ వల్లే ఈ ఫిట్​నెస్​ సాధ్యమైందని వివరించింది. స్టార్ హీరోగా, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కెరీర్ సాగించాలంటే.. దాని వెనకాల చాలా కష్టం దాగి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు మరింత కేర్ తీసుకోక తప్పదు.

ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్ నెస్, అందంలో మెప్పించాలంటే నటీమణులకు సవాల్ అనే చెప్పాలి. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చెక్కుచెదరని అందంతో కొన్నేళ్లు గా ఆకట్టుకుంటూనే వస్తోంది. 2005లో మొదలైన మిల్క్ బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘భోళా శంకర్’, ‘జైలర్’ వరకూ నిర్విరామంగా, ఎక్కడా తగ్గకుండా కొనసాగుతోంది. అందుకు కారణం.. తమన్నా తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో.. ఫిట్ నెస్, గ్లామర్ విషయంలోనూ అంతే శ్రద్ధ వహిస్తుండటమని అర్థమవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here