‘గాండీవ ధారి అర్జున’ మూవీ ఫుల్ రివ్యూ.. మంచి పాయింట్ ని చెడగొట్టేసారు!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగబాబు , తొలిసినిమా నుండే తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ పోయాడు. ఫిదా, తొలిప్రేమ , గద్దలకొండ గణేష్,ఎఫ్ 2 , ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి మార్కెట్ ని ఏర్పర్చుకున్న వరుణ్ తేజ్ ఎఫ్ 3 చిత్రం తర్వాత ‘గాండీవ ధారి అర్జున’ అనే సినిమా చేసాడు. టీజర్ , ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. నాగార్జున తో గత ఏడాది ఈయన ఘోస్ట్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని తీసాడు. ఇక ఈరోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుందో ఒకసారి చూద్దాము.

కథ :

కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహాదుర్ (నాజర్) లండన్ లో జరగబొయ్యే గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ శృతి (రోషిణి ప్రకాష్) అనే అమ్మాయి ఆదిత్య రాజ్ కి కొన్ని కీలకమైన వీడియోస్ తో నిండిన పెన్ డ్రైవ్ ని ఇవ్వాలని చూస్తుంటే. ఈ క్రమం లో ఆదిత్య పై దాడులు జరుగుతాయి. ఇక నుండి అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకునేందుకు సెక్యూరిటీ గా అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ని నియమిస్తారు. ఆయనకీ పర్సనల్ సెక్రటరీ గా, ఐపీఎస్ అధికారి ఐరా (సాక్షి వైద్య) పని చేస్తుంది. ఈమె ఒకప్పుడు అర్జున్ కి ప్రేమికురాలు. అయితే ఎందుకు వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది, మంత్రి మీద దాడులు చేసినవాళ్లు ఎవరు?, ఆ దాడికి విదేశాల నుండి వస్తున్నా మెడికల్ వెస్టీజి కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన స్టోరీ.

- Advertisement -

విశ్లేషణ :

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ప్రేక్షకులు ఎక్కడ కనెక్షన్ కట్ అవ్వకుండా గ్రిప్పింగ్ గా ఉండే విధంగా తియ్యాలి. కానీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఇక్కడ విఫలం అయ్యాడనే చెప్పాలి. ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ కే బోరింగ్ గా ఫీల్ అవుతారు. సినిమాలో ఆసక్తికరమైన పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. మెడికల్ వెస్టీజి సబ్జెక్టు మీద సినిమా తియ్యాలి అనుకోవడం మంచి విషయమే, నేడు మన దేశం లో కార్బన్ ఫుట్ ప్రింట్ సమస్య క్యాన్సర్ కంటే దారుణం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. కాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తీసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళేది.

ఇక మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఏమాత్రం కూడా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఇలాంటి జానర్ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేణుముక లాంటిది. కానీ ఈ చిత్రం లో అదే మైనస్,కీలకమైన సన్నివేశాలకు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వలేదు. ఇక వరుణ్ తేజ్ నటన ఇంతకుముందు సినిమాల్లో ఉన్నట్టుగానే ఉంది. ఇక హీరోయిన్ సాక్షి వైద్య తన అందం తో వెండితెర మీద మెరిసిపోయింది. నటన కూడా ఆమె పరిధిమేర బాగానే నటించింది. కథతో పాటుగా ఆమె పాత్ర పర్ఫెక్ట్ గా ప్రయాణించింది. ఓవరాల్ గా సినిమాని పార్టులు పార్టులుగా చూస్తే బాగానే ఉంది కానీ, ఎమోషనల్ కనెక్ట్ మాత్రం సూన్యం.

నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్‌, రోషిణి ప్రకాష్‌ తదితరులు
ఛాయాగ్రహణం : ముఖేష్ జి
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

చివరిమాట :

కొన్ని యాక్షన్ బ్లాక్ బాగున్నాయి, వరుణ్ తేజ్ కోసం ఒకసారి సినిమాని చూడొచ్చు.

రేటింగ్ : 2.25 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here