Kriti Shetty : ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మనసులను తన అందంతో కొల్లగొట్టింది కృతి శెట్టి. తన పేరు కన్నా సినిమాలోని బేబమ్మ పాత్రతోనే ఫేమస్ అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి అదృష్టం ఏ రేంజ్ లో ఉండేది అంటే.. ఏ సినిమా అయినా సరే కృతి శెట్టి కావాలి అనేంతగా.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అలాగే అమ్మడు కూడా స్టార్ హీరోల సినిమాలనే ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది.

అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు సెట్ కాలేదని తమిళ్ కు వెళ్ళింది. అక్కడ సూర్య సరసన నటించే అవకాశం అందుకుంది. ఇంకేముంది పాప దశ మారబోతుంది అనుకున్నారు. కానీ, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. దీంతో కృతి మళ్లీ బ్యాక్ తో పెవిలియన్ కు చేరుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా ఉంది. ఇక అవకాశాల కోసం అందరు హీరోయిన్లు చేసే పనినే అమ్మడు కూడా చేయడం మొదలుపెట్టింది.

అదే అందాల ఆరబోత. ఉప్పెన సినిమా నుంచి ఎంతో పద్దతిగా కనిపించిన కృతి ఈ మధ్య పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని అందాలను ఆరబోస్తుంది. తాజాగా డెనిమ్ షార్ట్ లో థైస్ అందాలను ఎలివేట్ చేసి అమ్మడు అరిపించేసింది. వెకేషన్ లో భాగంగా ఈ చిన్నది బ్లూ డెనిమ్ షార్ట్ పై వైట్ స్వెట్ టీ షర్ట్ తో అదిరిపోయింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అవకాశాల కోసం నువ్వు కూడా.. అదే చేస్తున్నావా బేబమ్మ.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో.. ఎలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.