అల్లు అర్జున్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి..? ఇది కదా అసలు సిసలు కాంబినేషన్ అంటే!

- Advertisement -

టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాల జోరు ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాతో ప్రారంభమైన ఈ మల్టీస్టార్ర్ర్ సినిమాల జోరు #RRR చిత్రం తో నేటి తరం మాస్ స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేసేంత రేంజ్ కి ఎదిగింది మన టాలీవుడ్. ఒకప్పుడు ఒక హీరో పాత్ర తక్కువ అయితే ఆ హీరో అభిమానులు గొడవలు చేస్తారనే భయం ఉండేది ఫ్యాన్స్ నుండి.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

కానీ మారుతున్న ట్రెండ్ ప్రకారం అభిమానుల మైండ్ సెట్ కూడా మారుతుంది , సినిమాని సినిమాలాగే చూడడం ప్రారంభించారు. ఫలితంగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకి వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లబోతుందని టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఒకసారి చూద్దాము.

అసలు విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నాల్గవ సినిమా రాబోతుందని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. గతం లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అలవైకుంఠపురం లో వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నాయి.

- Advertisement -

ఇప్పుడు ఈ నాల్గవ సినిమా ని మహాభారతం లోని మనకెవ్వరికి తెలియని ప్రవాన్ని తీసుకొని, ఆ కోణం లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని రాసాడట. కథ రీత్యా ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర ఎంతో కీలకం. కచ్చితంగా ఈ పాత్రని పెద్ద హీరో చెయ్యాల్సిందే , అందుకే ఆ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి ని సంప్రదించే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్, ఒకవేళ చిరంజీవి ఒప్పుకొని ఈ సినిమా చేస్తే మూవీ రేంజ్ ఎవ్వరూ ఊహిచంచబి రేంజ్ వెళ్తుంది. మరి చిరంజీవి ఒప్పుకుంటాడా లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here