కావ్య కల్యాణ్ రేంజ్ మాములుగా లేదుగా.. లిప్ బామ్ కూడా అమెరికా నుంచి తెప్పించుకుంటుందిట..

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కావ్య కల్యాణ్‌రామ్ ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది. తక్కువ సినిమాలు, చిన్న సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా బలగం హిట్‌తో అందరి కంట్లో పడింది. తాజాగా ‘ఉస్తాద్‌’తో అలరించిన ఈ అచ్చ తెలుగమ్మాయిని పలకరిస్తే బోలెడు విషయాలు చెప్పింది. ‘‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు ఏదో ఫంక్షన్‌లో నన్ను చూశారట. నా కళ్లు బాగా నచ్చి ‘గంగోత్రి’లో హీరోయిన్‌ చిన్నప్పటి పాత్రకు నన్ను బాలనటిగా ఎంపిక చేశారు. సరదాగా ప్లేగ్రౌండ్‌కి వెళ్తున్నట్లుగా షూటింగులకి వెళ్లేదాన్ని.

కావ్య కల్యాణ్
కావ్య కల్యాణ్

అలా చిన్నప్పుడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ లాంటి బిగ్‌స్టార్స్‌తో నటించే అవకాశం లభించింది. ‘పెద్దయ్యాక నాతో హీరోయిన్‌గా నటిస్తావా?’ అని ‘గంగోత్రి’ షూటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ తమాషాగా అడిగితే… ‘అప్పటికి మీరు ముసలోళ్లవుతారు. నేను చెయ్యను’ అని నవ్వుతూ బదులిచ్చేదాన్ని. నేను పెద్దయ్యాను కానీ, ఆయన మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. ‘బలగం’ సినిమా ఆడిషన్‌ కోసం దిల్‌రాజు గారి ఆఫీసు నుంచి కాల్‌ వచ్చింది. నేను క్యాజువల్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని వెళ్లాను. డైరెక్టర్‌ వేణు నన్ను చూసి ‘పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌. కుర్తీ, దుపట్టా వేసుకుని మళ్లీరా’ అన్నారు.

త్వరత్వరగా ఇంటికెళ్లి డ్రెస్‌ మార్చుకుని వచ్చా. అప్పుడు కాస్త ఊరి అమ్మాయిలా కనిపించడంతో ఓకే చేశారు. ‘బలగం’ విడుదలయ్యాక రాఘవేంద్రరావుగారు నన్ను పిలిచి మెచ్చుకున్నారు. నేను ప్రత్యేకమైన లిప్‌బామ్‌ వాడుతా. అది యూఎస్‌లో మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడూ నా వ్యాలెట్‌లో ఉంటుంది. ఇటీవల ‘ఉస్తాద్‌’లో నా సహ నటుడు శ్రీసింహ (కీరవాణి కొడుకు) తన తండ్రితో కలసి ఆస్కార్‌ వేడుకలకు యూఎస్‌ వెళ్లాడు. ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఆ బ్రాండ్‌ లిప్‌బామ్‌లు పది తీసుకొచ్చి బహు మతిగా ఇచ్చాడు. అవి ఎప్పటికీ నాకు స్పెషలే’’ అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here