టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొత్తగా విడుదల అవుతున్న సినిమాలలో ఎక్కువ శాతం అట్టర్ ఫ్లాప్ అవుతుండడం తో బయ్యర్స్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపిన కొన్ని సినిమాలను లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి విడుదల చేస్తున్నారు. కొన్ని సినిమాలు గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి కానీ, మరికొన్ని సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి.

ఇక రీసెంట్ గా అయితే మహేష్ బాబు పుట్టినరోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ‘బిజినెస్ మేన్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. అప్పటి వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్న ఖుషి మొదటి రోజు రికార్డు ని బద్దలు కొట్టి ఏకంగా 5 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

అయితే ఈ సినిమా స్పెషల్ షోస్ రికార్డ్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ప్రదర్శించబోయే గుడుంబా శంకర్ చిత్రం బద్దలు కొట్టేస్తుందని నమ్మకం తో ఉండేవారు ఫ్యాన్స్. సరైన ప్లానింగ్ తో ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో గ్రాండ్ గా విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ చిత్ర నిర్మాత నాగబాబు స్వయంగా ఈ విషయాన్నీ తెలియచేసాడు కూడా, అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మరియు గుడుంబా శంకర్ రీ రిలీజ్ కి రెండు రోజుల గ్యాప్ ఉండడం వల్ల మరీ లాంగ్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 వ తేదికి వాయిదా వేస్తున్నట్టుగా కాసేపటి క్రితమే తెలియచేసారు.

అంతే కాకుండా సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు. ఈ టీజర్ ని కూడా సినిమాకి అటాచ్ చేసి విడుదల చేయబోతున్నారట. కేవలం దీనికోసమే సినిమాని సినిమాని ఆగష్టు 31 వ తేదీ నుండి సెప్టెంబర్ 2 కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
