ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో కెరీర్ లో అత్యధిక మంచి సినిమాలు ఉన్న స్టార్ హీరో ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇది కేవలం మహేష్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, వేరే ఏ హీరో ఫ్యాన్ ని అడిగినా మహేష్ బాబు పేరే చెప్తారు. ఒకటి రెండు సినిమాలు మినహా ప్రతీ చిత్రం ఒక ఆణిముత్యం లాగానే ఉంటుంది.
మహేష్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్ కి ఎవరైనా అలా ఫిదా అవ్వాల్సిందే. ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాలు సైతం టీవీ లలో సూపర్ హిట్స్ గా నిల్చినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ‘ఖలేజా’ ఒకటి. అతడు చిత్రం తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రం ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ముఖ్యంగా ఆరోజుల్లో ఈ చిత్రంలోని ‘సదా శివ సన్యాసి’ అనే పాట చిత్రం పై భారీ అంచనాలను పెంచింది. అలా భారీ అంచనాలు ఉండడం వల్లే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ అయ్యాక, ఇంత మంచి సినిమాని ఫ్లాప్ ఎలా చేసారు అని అనుకున్నారు అందరూ. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అయ్యింది కానీ, ఓవర్సీస్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రం ఓవర్సీస్ లో నాలుగు లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసి ఆల్ టైం హిట్ గా నిల్చింది. ఆ సినిమా రికార్డ్స్ ని మహేష్ ‘ఖలేజా’ చిత్రం అవలీలగా బ్రేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా 5 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు, ఇక ఆ తర్వాత మహేష్ ‘దూకుడు’ చిత్రం తో టాలీవుడ్ కి మొట్టమొదటి 1 మిలియన్ సినిమాగా నిల్చింది.