బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా మారి పలు చిత్రాలతో దూసుకుపోతున్నారు. తన తాజా చిత్రం సౌండ్ పార్టీని జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్-1 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రంలో వీజే సన్నీకి జోడిగా హ్రితిక శ్రీనివాస్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకుడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో సౌండ్ పార్టీ
థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నేడు ప్రసాద్ ల్యాబ్స్ లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా మూవీ టీజర్ లాంచ్ జరిగింది.

సౌండ్ పార్టీ
టీజర్ బావుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శివన్నారాయణ, సన్నీ మధ్య కామెడీ టైమింగ్స్ అదిపోయాయి. డైలాగ్ కు విజిల్స్ పడడం గ్యారెంటీ. అయామ్ అండర్ కవర్ కాప్.. మీము మున్నురు కాపు లాంటి హిల్లేరియస్ డైలాగ్స్ థియేటర్లలో నవ్వుల పంట పండించడం గ్యారెంటీ అనిపిస్తోంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్రం టాలీవుడ్‌కు మరో ‘జాతి రత్నాలు’ అవుతుంది అన్నారు. వీజే సన్నికి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని టీజర్ చూస్తే కచ్చితంగా అర్థమవుతోంది.

సప్తగిరి, చలాకీ చంటి లాంటి కమెడియన్లు సినిమాను మరో స్థాయికి తమ కామెడీతో తీసుకెళ్లనున్నారు. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని తిరిగే క్వాలిటీ నచ్చే ఈ చిత్ర సమర్పకుడు జయశంకర్ కు పేపర్ బాయ్ సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చానని సంపత్ నంది తెలిపారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సంపత్ నందికి నిర్మాత రవి పొలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
సెప్టెంబర్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలన్న లక్ష్యంతోనే ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ స్థాపించామన్నారు. ఇకపై కంటిన్యూస్ గా సినిమాలు చేస్తామన్నారు. టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామన్నారు. ఈ సినిమాలో థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు,‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి తదితరులు నటించారు.