నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య తదితరులు
కథ : అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి
పాటలు : కిట్టూ విస్సాప్రగడ
ఛాయాగ్రహణం : రాంపీ నందిగాం
సంగీతం : ఎస్. అనంత్ శ్రీకర్
నిర్మాత : శివప్రసాద్ పన్నీరు
రచన, దర్శకత్వం : అభిషేక్ మహర్షి
విడుదల తేదీ: ఆగస్టు 18, 2023
ప్రముఖ దర్శకుడు శోభన్ వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉన్న సంతోష్ కు ప్రస్తుతం హిట్ కంపల్సరీ. దీంతో కామెడీని నమ్ముకుని సంతోష్ తీసిన తాజా చిత్రం “ప్రేమ్ కుమార్”. ఎప్పుడో మూడేళ్ళ క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా నేడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమా పై ఎలాంటి హైప్స్ క్రియేట్ చేయలేకపోయాయి. ఎలాంటి హడావుడి లేకుండా సైలంట్ గా చేసిన ప్రమోషన్స్ కు మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటికే పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన రైటర్ అభిషేక్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టారు. ఇందులో సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ప్రేమ్ కుమార్. ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..
కథ : పేరులో మాత్రమే ప్రేమ ఉండి జీవితంలో ప్రేమకు తావులేని పాత్ర ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్)ది. సినిమా స్టార్టింగ్ లోనే నేత్ర (రాశి సింగ్) పెళ్లి మండపంలో ఉంటారు. కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఆకస్మాత్తుగా పెళ్లి ఆపేయండి అంటూ రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వస్తాడు. మీమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి చేయాలని కోరతాడు. నేత్ర తండ్రి (రాజ్ మాదిరాజు) పిల్లల ప్రేమను అర్థం చేసుకుని అతనికి తన కూతురును ఇచ్చి పంపేస్తాడు. దీంతో చేసేదేం లేక ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి సిద్ధమవుతాడు. అదీ క్యాన్సిల్ అవుతుంది. స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి ప్రేమ్ కుమార్ డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ప్రేమ లేదా పెళ్లి జంటలను విడగొట్టడమే వీరు పనిగా పెట్టుకుంటారు. డబ్బులు బాగా వస్తుండటంతో ఫుల్ ఖుషీగా ఉంటారు. అటువంటి సమయంలో ప్రేమ్ కుమార్ కు నేత్ర అడ్డం పడుతుంది.. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన రోషన్, నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతాడు.. విషయం తెలిసిన నేత్ర ఏం చేసిందనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ:
కామెడీని నమ్ముకుని వెరైటీ కథను ఎంచుకుని డైరెక్టర్ మంచి ప్రయత్నం అయితే చేశారు కానీ.. పేపర్ మీద పెట్టిన సీన్స్ తెరపైకి వచ్చే సరికి పూర్తిగా మారిపోయాయి. ఉన్నది ఉన్నట్లు వచ్చినట్టు ఉంటే ‘ప్రేమ్ కుమార్’ పరిస్థితి వేరేలా ఉండేది. చూసేటప్పుడు ప్రేక్షకులు నవ్వాలా వద్ద అన్న మీమాంసలో ఆగిపోయారు. అయితే ఈ రోజుల్లో పెళ్లి కాని యువతీ యువకులు, తమ ప్రేయసి / జీవిత భాగస్వామిపై అనుమానం ఉన్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి వాళ్లకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ సన్నివేశాలు తీసుకుంటే కామెడీ మరింత పండే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రతీ సీన్ ఇక చాల్లే అన్నట్లు ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అభిషేక్ మహర్షి తీసిన సినిమాలోని కథ బాగున్న కథనం ఆసక్తి కలిగించకుండా ముందుకు సాగిపోయింది. సినిమాలో హైలట్ అనిపించే సీన్లు పెద్ద ట్విస్టులు ఏమీ లేకుండా సాదాసీదాగా సాగిపోతుంది. ఇక సంగీతం ఫర్వాలేదు. నిర్మాణానికి నిర్మాతలు రిచ్ నెస్ కోసం బాగానే ఖర్చు పెట్టారు.
నటీనటుల ఫర్ఫామెన్స్ :
ప్రేమ్ కుమార్ పాత్రకు సంతోష్ శోభన్ తనంతలో బాగానే న్యాయం చేశారు. మిడిల్ క్లాస్ యువకుడిలా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ప్రేమ్ కుమార్ అలియాస్ పీకేగా పాత్రలో సంతోష్ ఒదిగిపోయారు. అంగనా పాత్రలో రుచితా సాధినేని చక్కగా చేశారు. హీరో మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ బాగానే నవ్వించారు. హీరో రోషన్ బాబు పాత్రలో నటించిన కృష్ణ చైతన్య బాగున్నాడు. కానీ నటనపై ఇంకాస్త దృష్టి పెట్టాలి.
బాటమ్ లైన్ :
వెరైటీ కథతో హిట్టు కొట్టాలని సంతోష్ ప్రయత్నం బాగుంది. కానీ కామెడీ వర్కౌట్ కాలేదు. దీంతో ప్రేక్షకులు థియేట్లర్లో ఎంజాయ్ చేయలేకపోయినా.. ఓటీటీలోనైనా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ : 2.25/5