ఈ ఏడాది భారీ సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ రావడం ట్రేడ్ ని తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , మెగాస్టార్ చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ సినిమాలు రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఇలాంటి సమయం లో తమిళ డబ్బింగ్ సినిమాలు , మరియు టాలీవుడ్ చిన్న సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ ని కాపాడాయి. బయ్యర్స్ కి లాభాలను తెచ్చిపెట్టాయి.

చిన్న సినిమాలే ఈ రేంజ్ లాభాలు తెచ్చిపెడితే ఇక పెద్ద సినిమాలు హిట్ టాక్ ని తెచ్చుకుంటే ఏ రేంజ్ వసూళ్లను రాబడుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ చూపు మొత్తం విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ చిత్రం వైపే ఉంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు, ఎందుకంటే విడుదలైన టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల నుండి ఆ రేంజ్ ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.

ఇకపోతే రీసెంట్ గా జరిగిన ‘ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ కూడా ఈ చిత్రం పై అంచనాలు భారీ గా పెంచేలా చేసాయి. మొదటి కాపీ మొత్తం సిద్ధం అవ్వడం తో కొంత మంది మీడియా మిత్రులు మరియు సినీ ప్రముఖులకు ‘ఖుషి’ చిత్రాన్ని వేసి చూపించారు. అక్కడి నుండి అందుతున్న రిపోర్ట్ ని ఒకసారి పరిశీలిస్తే, డైరెక్టర్ శివ నిర్వాణ కొత్త పాయింట్ ని పట్టుకొని చక్కగా తీసాడు కానీ, న్యారేషన్ చాలా స్లో గా ఉందని అంటున్నారు.

అక్కడక్కడా కొన్ని ఎమోషన్స్ బాగానే పండిందట. ఓవరాల్ గా యావరేజి రేంజ్ సినిమా, సమంత మరియు విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ మరియు పాటలే ఈ చిత్రాన్ని కాపాడాలి అని అంటున్నారు. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని, టాక్ తేడా అయితే మాత్రం మరో లైగర్ గా నిలిచిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు . మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 1 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.
