నిహారిక పర్సనల్ లైఫ్ టచ్ చేసిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

- Advertisement -

చావు దరిదాపుల్లో దాకా వెళ్లి వచ్చారు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆయన వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. విరూపాక్షతో కెరీర్లోనే తొలి 100కోట్ల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ఫర్వాలేదు అనిపించారు. బ్రో సినిమాతో ఎన్నో రోజుల సాయిధరమ్ తేజ్ కల నెరవేరింది. పవన్ తో సినిమా చేశానన్న సంతృప్తి సాయికి కలిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఓ నెటిజన్ కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నోరు మూసుకోమన్నారు. వెంటే ఆ కామెంట్ డిలీట్ చేయ్ అంటూ ఘాటుగా స్పందించారు. ఇంతకీ అసలు మేటరేంటంటే..

సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్

నాగబాబు కుమార్తె నిహారిక- కృష్ణ చైతన్య జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిహారిక పలు వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం సాయి తేజ్ ఓ అప్డేట్ ను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. తన ఫ్రెండ్, సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ కృష్ణ కోరగా స్వాతిరెడ్డితో కలిసి ‘సత్య’ అనే వీడియో సాంగ్ లో నటించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సాంగ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చినప్పుడు.. మెగాడాటర్ రిప్లై ఇచ్చింది. ఈ సాంగ్ చూడడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ ఆకతాయి నిహారిక పర్సనల్ లైఫ్‎ను టచ్ చేస్తూ.. కామెంట్ చేశాడు. “వీటిపైన పెట్టిన ద్యాస.. ఫ్యామిలీపై పెట్టుంటే బాగుండేది” అంటూ ఎగతాళిగా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూసిన సాయి తేజ్‎కు విపరీతమైన కోపం వచ్చింది. “నోరు మూసుకో.. వెంటనే కామెంట్ డిలీట్ చెయ్” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇక తేజ్ ఫ్యాన్స్ కూడా ఆ నెటిజన్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సైతం తన వార్నింగ్‎ను డిలీట్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here