మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారి పెళ్లిపై స్పందించారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా ప్రముఖ ఛానెల్లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో వరుణ్.

ఇందులో భాగంగా గాండీవధారి అర్జున సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే మొదటిసారి లావణ్య త్రిపాఠి గురించి, ప్రేమ, ఎంగేజ్మెంట్, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు వరుణ్. ‘‘గత ఐదేళ్లుగా లావణ్య నేను ప్రేమలో ఉన్నాం. ముందు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఆ ప్రయాణంలో ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి.. అందుకే మరో అడుగు ముందుకు వేయాలనుకున్నాం. ముందు నేను లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాను. అదే విషయాన్ని ఇంట్లో చెప్పాను వాళ్లు కూడా ఒప్పుకొన్నారు. లావణ్య నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది.

ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా తనే గిఫ్ట్ ఇచ్చింది. నా ఇష్టాలు లావణ్యకి బాగా తెలుసు. ఆమె చాలా మెచ్యూర్డ్ అండ్ కేరింగ్ పర్సన్. ఇక పెళ్లి కూడా ఎంగేజ్‌మెంట్‌లానే సింపుల్‌గా చేసుకుందాం అనుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చాడు అని వరుణ్. ప్రస్తుతం వరుణ్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మిస్టర్’ కోసం తొలిసారి లావణ్య – వరుణ్ కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారు. జూన్ 9న వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి జరగనుంది.