పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ అభిమానుల మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటున్న రేణు దేశాయ్ మీద ఎవరు కామెంట్ చేసినా వెంటనే వాటికి ఆమె కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఒక పవన అభిమాని ప్లీజ్ అమ్మ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి అంటూ కామెంట్ పెట్టినందుకు ఆమె అతనికి వరుసగా కౌంటర్లు ఇచ్చింది.

అసలు నేను సోషల్ మీడియా నుంచి ఎందుకు దూరంగా ఉండాలి? నేనేమైనా క్రిమినల్ పనులు, తప్పుడు పనులు చేస్తున్నానా? సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండడానికి.. లేదా భావ ప్రకటన స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా నాకు లేదా? నేను ఈ డెమోక్రటిక్ దేశానికి చెందిన దాన్ని కాదా? అంటూ ఆమె వరుస ప్రశ్నలు సంధించింది. ఈ ఇంస్టాగ్రామ్ నా పర్సనల్ అకౌంట్, మీరు నా పర్సనల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కింద కామెంట్ పెట్టి నన్ను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండమంటారా? నేను ఇకమీదట సైలెంట్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. నా మాజీ భర్త గురించి నిజమే మాట్లాడాను అలాగే ఆయన్ని సపోర్ట్ చేసే నిర్ణయం కూడా నాదే, ఈ విషయంలో ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా వినేది లేదు అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేశారు.

అలాగే ఇంస్టాగ్రామ్ సెట్టింగ్స్ జనాలు కామెంట్ చేయడానికి అనుమతి ఇచ్చేలా ఉన్నాయి కానీ ఇది నా పర్సనల్ స్పేస్. పాలిటిక్స్ గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఎలాంటి సంబంధం లేని నా మీద ఎందుకు వారి పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి రుద్దుతున్నారు. నిజానికి చాలా మంది సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోమని నాకు సలహా ఇచ్చారు. ఇప్పటికే నేను ట్విట్టర్ డిలీట్ చేశాను, ఫేస్బుక్ వాడడం లేదు. ఇప్పుడు ఈ ఇంస్టాగ్రామ్ కూడా డిలీట్ చేయాలా? అసలు ఇందులో నా తప్పేంటి అంటూ ఆమె ప్రశ్నించారు.