డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత ఏడాది విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్కుతో మంచి యాక్టింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. అయితే ప్రస్తుతం రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్న పూరీ.. తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

అంతే కాకుండా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న పూరీతో ఇప్పుడు ఏ స్టార్ హీరోలు కూడా సినిమా చేయడానికి సిద్ధంగా లేరు అనేలా కథనాలు వెలువడుతున్నాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆ విధంగా కాకుండా పూరి జగన్నాథ్ తో మరోసారి చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో ఇదివరకే ఒక టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు పూరి కలయికలో ఒక సినిమా చేయడానికి మరింత ఎక్కువ స్థాయిలో చర్చలు కొనసాగిస్తూన్నట్లు సమాచారం. గతంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అని అనుకున్నప్పుడు పూరి జగన్నాథ్ ఆటో జానీ అనే ఒక క్యారెక్టర్ తో స్టోరీ లైన్ అనుకున్నాడు.

కానీ మెగాస్టార్ అతనితో అప్పుడు ఆ సినిమా చేయడానికి సిద్ధం కాలేదు. కానీ ఈసారి పూరి జగన్నాథ్ హీరోల కోసం వెతుకుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతని రీసెంట్ ట్రాక్ రికార్డును పక్కనపెట్టి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. పూరి ప్రస్తుతం పూర్తిస్తాయిలో మెగాస్టార్ కోసం కథ రెడీ చేసేలా స్క్రిప్ట్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఇక సరైన కంటెంట్ సెట్ అయితే వీలైనంత తొందరగా మెగాస్టార్ చిరంజీవి ఇదే ఏడాది ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మరోసారి చిరంజీవికి డిజాస్టర్ ఖాయమంటున్నారు ట్రెడ్ నిపుణులు.