టాలీవుడ్లో కేరళ కుట్టీలకు ఈ మధ్య మంచి డిమాండ్ ఉంది. అలా తొలుత చిన్న పాత్రలో కనిపించి హీరోయిన్ ఆఫర్ అందుకున్న వారిలో సంయుక్త మీనన్ ఒకరు. పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది కాసేపే అయినా అమ్మడు యాక్టింగ్ చూసి మనోళ్లు ముద్దుగుమ్మకు మంచి ఫ్యూచర్ ఉందని అప్పుడే చెప్పారు. దీంతో వరుసగా బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాల్లో ఛాన్స్ ఇచ్చారు.
దీంతో ఆశించినట్లే తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టకుంది. అమ్మడు నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే లాస్టులో వచ్చిన విరూపాక్ష సినిమాలో అమ్మడు నట విశ్వరూపం చూపించి సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. దీంతో రూ.100కోట్లు సినిమా తెలుగు ఇండస్ట్రీకి అందించడంలో తనవంతు కృషి చేసింది. ఈ సినిమాతో సంయుక్త స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో అమ్మడుకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం సంయుక్త ఇంటి ముందు నిర్మాతలకు మా సినిమాలో చేయమని క్యూ కడుతున్నారు. కానీ అమ్మడు కథలు, సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తోంది. తనకు ప్రాధాన్యమున్న పాత్రలు, రెమ్యునరేష్ చూసి మరీ సినిమాలను సెలక్ట్ చేస్తోంది. ప్రస్తుతం తను నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో చేస్తోంది. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తో కూడా ఒక పాన్ ఇండియా చిత్రం లో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భారతి కృష్ణమాచార్య డైరెక్టర్.
స్పై సినిమా ప్లాప్ తర్వాత నిఖిల్ తన రాబోయే సినిమా హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే యూనిట్ సినిమా పేరు స్వయంభుగా కన్ ఫాం చేసినట్లు సమాచారం. అయితే దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న సామెత ప్రకారం సంయుక్త కూడా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించేందుకు సంయుక్త భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
సంయుక్త తన గత చిత్రాలకు కోటి లోపల రెమ్యూనరేషన్ అందుకుంది. అవి సూపర్ హిట్స్ కావడంతో ఈ ముద్దుగుమ్మ ఒకేసారి తన రేట్ పెంచేసింది. ఇప్పుడు స్వయంభూ సినిమా కోసం ఏకంగా రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. గోల్డెన్ లెగ్ గా ముద్రవేయించుకున్న ఈ ముద్దుగుమ్మ అంత అడగడంలో తప్పులేదని ఆమెను ఫ్యాన్స్ సపోర్టు చేస్తున్నారు.