‘భోళా శంకర్’ 2 రోజుల వసూళ్లు..మెగాస్టార్ కి ఘోరమైన అవమానం ఇది!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే మొదటి నుండి ఈ చిత్రం పై దారుణమైన నెగటివిటీ ఉండేది. అయితే మెగా ఫ్యాన్స్ చిరంజీవి స్టార్ స్టేటస్ మెహర్ రమేష్ అనే నెగటివ్ అంశాన్ని మర్చిపోయేలా చేస్తుంది అని అనుకున్నారు.

భోళా శంకర్
భోళా శంకర్

కానీ మెహర్ రమేష్ నెగటివ్ వేవ్ ఎంత పవర్ ఫుల్ అనేది ‘భోళా శంకర్’ కలెక్షన్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇంత వరస్ట్ కలెక్షన్స్ వచ్చే రేంజ్ లో అయితే ‘భోళా శంకర్’ లేదు. యావరేజి కంటెంట్ మూవీ, కానీ మెహర్ రమేష్ సినిమా అనే ఈ రేంజ్ నెగటివ్ టాక్ వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా రెండు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇందులో నాలుగు కోట్ల రూపాయిలు హైర్స్ తీసేస్తే , కేవలం 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు. చిరంజీవి కి ఇది మామూలు రేంజ్ అవమానం కాదు, ఇక రెండవ రోజు అయితే ప్రతీ సెంటర్ లో జైలర్ సినిమా భోళా శంకర్ ని డామినేట్ చేసింది. జైలర్ కి టికెట్స్ దొరక్కపోతే ‘భోళా శంకర్’ కి వెళ్లారు, అలాంటి నీచమైన పరిస్థితి మెగాస్టార్ కి పట్టింది.

- Advertisement -

రెండవ రోజు మొదటి రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే 75 శాతం డ్రాప్స్ పడ్డాయి. అంటే కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు 5 లక్షల డాలర్స్ కూడా రాలేదు, మొదటి రోజు ప్రీమియర్స్ కి రావాల్సిన ఈ నెంబర్, క్లోసింగ్ లో వస్తుంది అంటే క్లోసింగ్ 30 కోట్ల రూపాయిల కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here