అప్పుడెప్పుడో శివాజీ సరసన ఆలయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది హనీరోజ్. అసలు ఈ సినిమా అనేది ఒకటి ఉందా అని ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతుండొచ్చు. నిజానికి ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ గుర్తులేదనుకోండి. కాకపోతే అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన హనీ రోజ్ ఫర్వాలేదు అనిపించినా అమ్మడికి ఎందుకో తర్వాత ఛాన్సులు రాలేదు. దీంతో తన మాతృభాష మళయాలంలోనే సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చాన్నాళ్లకు లక్కీగా బాలయ్య సరసన తెలుగులో నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో అమ్మడి అదృష్టమే మారిపోయింది. అప్పటి కంటే ఇప్పుడు అమ్మడి అందాలు చూసిన కుర్రకారు వెర్రెక్కిపోయారు. నిజంగా తేనెలాంటి అందాలతో కనువిందు చేసింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ కే ఎక్కువ పాపులారిటీ దక్కింది. బాలయ్య బాబుకు తల్లిగా, మరదలిగా హనీ రోజ్ ఫర్ఫామెన్స్ అదర గొట్టేసింది. ఆ సినిమా చూసిన తర్వాత ఇన్నాళ్ల పాటు ఈ అందాన్ని ఎలా మిస్ చేసుకున్నామని అందరూ ఫీలయ్యారు. బాలకృష్ణ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడతాయని భావించారు. అందరూ ఊహించినట్లుగానే ఆమె బిజీ అయింది. కాకపోతే సినిమాలతో కాదు.. వరుస షాప్ ఓపెనింగ్స్ తో. అవును ఈ బ్యూటీ సినిమాల్లో కంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా కూడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఆమె సందడి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్ రిబ్బన్ కటింగ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె రెడ్ కలర్ చీరలో మెరిసిపోయింది. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు హనీ రోజ్ సినిమాకు ఎంతైతే వసూలు చేస్తుందో అంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. దాదాపు రూ. 60-70 లక్షలు ఇచ్చుకోవాల్సిందేనట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రిబ్బన్ కటింగ్కే అంత రెమ్యునరేషనా.. హనీ రోజ్ లెవల్ మామూలుగా లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.