మన చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాం. క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ స్టేటస్ ఇలాంటి పదాలకు బొద్దు కోసి పేరు పెట్టినట్టు ఉంటాది మెగాస్టార్ ని చూస్తుంటే. సుమారుగా మూడు దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరో గా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలిన చిరంజీవి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల పదేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యాడు.
ఆ గ్యాప్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ,రామ్ చరణ్ వంటి హీరోలు ఇండస్ట్రీ రికార్డ్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నారు కానీ, చిరంజీవి వదిలేసినా కుర్చీలో మాత్రం కూర్చోలేకపోయారు. మళ్ళీ ఆయనే ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నాడు. అలా రీ ఎంట్రీ తర్వాత మూడు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న సినిమాలు చేసిన హీరో గా నిలిచాడు. టాలీవుడ్ లో మెగాస్టార్ కి తప్ప ఎవరికీ ఇన్ని వంద కోట్ల రూపాయిలను వసూళ్లను సాధించిన సినిమాలు లేవు.
అయితే చిరంజీవి ఇప్పుడు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ తనకి ఉన్న అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ కి చిల్లు పెట్టుకుంటున్నాడు. నిన్న విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రం అందుకు ఒక ఉదహరా గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 9 ఏళ్ళ క్రితం తమిళం లో విడువులై సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ వేదలమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలను తీస్తూ అభిమానులను గర్వపడేలా చేస్తుంటే, చిరంజీవి మాత్రం ఇలా అవుట్ డేటెడ్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ చిత్రం మొదటి రోజు ప్రధాన నగరాల్లో కూడా హౌస్ ఫుల్స్ ని రిజిస్టర్ చేసుకోకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు దశాబ్దాల మెగాస్టార్ కెరీర్ లో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కూడా మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడేవి. కానీ ‘భోళా శంకర్’ కి వైజాగ్ , విజయవాడ వంటి సిటీలలో కూడా హౌస్ ఫుల్స్ పడకపోవడం దురదృష్టకరం. ట్రేడ్ పండితుల సమాచారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇది చిరంజీవి రేంజ్ కి చాల చీప్ అనే చెప్పాలి. ఈ సినిమా ఫలితం చూసి అయినా చిరంజీవి ఇక రీమేక్ సినిమాలు ఆపుతాడో లేదో చూడాలి.