ఎంత వయస్సు పెరిగినా తరగని అందంతో మెరిసిపోయే హీరోయిన్స్ మన టాలీవుడ్ లో చాలా మండి ఉన్నారు. వీళ్ళు అందం తోనే కాదు , తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రప్పించగలరు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ. అప్పట్లో ఈమెకి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చెయ్యగలను అని నిరూపించిన అతి తక్కువ మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.
ఈమెకి సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ మంచి సన్నిహితులే. అలాంటి సన్నిహితులలో ముందు వరుసలో ఉంటాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఈయనకి రమ్యకృష్ణ ఫ్యామిలీ ఫ్రెండ్. మిగతా హీరోయిన్స్ తో చిరంజీవి వ్యవహరించే తీరు వేరు, రమ్య కృష్ణ మరియు రాధికా వంటి హీరోయిన్స్ తో వ్యవహరించే తీరు వేరు.
రమ్య కృష్ణ అంటే చిరంజీవికి ఎంత అభిమానమో ఒక సంఘటన ని ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేమిటంటే అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి ఒక కార్ ని మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేసి కొనుగోలు చేసాడు. ఆ కార్ అంటే చిరంజీవి కి ఎంతో ఇష్టం, ఎవరివన్నా ఆ కార్ ని ముట్టుకున్నా కూడా కోపగించుకునే వాడు. చిన్న గీత కూడా పడకుండా కాపుడుకునేవాడు. అయితే అప్పట్లో రజినీకాంత్ ‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె రిచ్ కాండిడేట్ గా కనిపిస్తుంది.
ఆమె వాడే కార్ అప్పటి వరకు ఎవ్వరూ చూడనిదిగా, ఎంతో అందంగా ఉండాలి. ఆ సమయం లో డైరెక్టర్స్ కొత్త కార్ మోడల్స్ ని ఎన్ని చూసినా వాళ్లకి నచ్చలేదు. ఒకరోజు రమ్య కృష్ణ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సరికొత్త కార్ ని చూసిన విషయం గుర్తుకు చేసుకొని, నేను లేటెస్ట్ గా వచ్చిన ఒక కొత్త మోడల్ కార్ ని తీసుకొస్తాను అని మాట ఇచ్చిందట. చిరంజీవి ని మీ కార్ కొన్ని రోజులు కావాల్సిందిగా కోరగా, చిరంజీవి మరో మారు కూడా ఆలోచించకుండా కార్ ని ఇచ్చేశాడట. చిన్న మారక పడితేనే తట్టుకోలేని చిరంజీవి, నెల రోజుల పాటు షూటిగ్ కోసం ఇచ్చాడంటే , రమ్య కృష్ణ అంటే ఎంత ప్రేమో , ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.