Jailer Review : ‘జైలర్’ మూవీ రివ్యూ..సూపర్ స్టార్ విద్వంసం మామూలుగా లేదు!

- Advertisement -

నటీనటులు : రజినీకాంత్, తమన్నా, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ , సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు

రచన, దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
బ్యానర్ : సన్ పిక్చర్స్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్

Jailer Review : సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కబాలి’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్రభావం రజినీ పై చాలా బలంగానే పడింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘కాలా’ కూడా రజినీ మార్కెట్ కి డెంట్ పెట్టింది. తెలుగు లో చాలా మంది స్టార్ హీరోలకు సరిసమానమైన మార్కెట్ ఉన్న రజినీ రేంజ్ ఈ సినిమా తర్వాత బాగా పడిపోయింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘పేట’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కానీ, అది రజిని రేంజ్ బ్లాక్ బస్టర్ ఏమాత్రం కాదు. ఆ తర్వాత విడుదలైన ‘దర్బార్’ చిత్రం కూడా యావరేజి గా నిల్చింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘అన్నాతే’ చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు చాలా నిరాశకి గురయ్యారు. దీంతో ఫ్యాన్స్ మొత్తం ‘జైలర్’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ మరీముఖ్యంగా పాటలు, ఇలా ప్రతీ ఒక్కటి కూడా అభిమానులను ఎంతో అలరించాయి. అంచనాలను పదింతలు అయ్యేలా చేసాయి. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకుందో లేదో ఒకసారి చూద్దాం.

- Advertisement -
Jailer Review
Jailer Review

కథ :

టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక కఠినమైన జైలర్. తన జైలు లో ఉన్న ఖైదీలను క్రమశిక్షణ లో పెట్టి, వాళ్ళని తన కంట్రోల్ లో పెట్టుకునే రేంజ్ సత్తా ఉన్నవాడు. ఆయన విధించిన నియమాలను అతిక్రమించే ధైర్యం ఏ ఖైదీ కి కూడా లేదు. అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో, ఫ్యామిలీ మ్యాన్ గా అంతటి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒక రోజు తన జైలు లో ఉన్న గ్యాంగ్ స్టర్ ని తప్పించబోతుంటే ముత్తువేల్ పాండియన్ అడ్డుకొని, మళ్ళీ జైలుకు పంపుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబం పై దాడి చేసి, అతని కొడుకుని అతి కిరాతకంగా చంపేస్తారు. తన కొడుకుని చంపింది వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడిగా మారుతాడు. ఒకవైపు వృత్తి మరోవైపు పగ, ఈ రెండిటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణే ఈ జైలర్ సినిమా.

విశ్లేషణ :

సినిమా ప్రథమార్థం చాలా స్లో గా ప్రారంభం అవుతుంది. అలా 40 నిమిషాల వరకు సినిమా స్లో గా నడవడం తో అభిమానులు రజినీకాంత్ కి మళ్ళీ ఫ్లాప్ పడబోతోందా అని బయపడొచ్చు. కానీ ఆ తర్వాత నుండి అసలు సినిమా ప్రారంభం అవుతుంది. నెల్సన్ మార్కు కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రెండు మూడు అదిరిపోయే సన్నివేశాలు పడ్డాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో డీసెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మీదనే నడుస్తుంది. ఆయన మార్క్ మ్యానరిజం, హీరోయిజం అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా కూడా మనకి టీజర్ , ట్రైలర్ లో చూపించిన ప్రధాన పాత్రలు ఎక్కడా కనిపించదు. తమన్నా, మోహన్ లాల్ , సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్ లో కనిపించరు.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే రజినీ కాంత్ విశ్వరూపం మొదలు అవుతుంది. మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు, రజినీకాంత్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఆడియన్స్ రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి. ఇది కదా సూపర్ స్టార్ నుండి ఇన్ని రోజులు మేము కోరుకున్నది అని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.ఆ రేంజ్ లో సన్నివేశాలను రాసుకున్నాడు డైరెక్టర్ నెల్సన్. రజినీకాంత్ ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ అద్భుతంగా వాడుకున్నాడు అనే అనుభూతి ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది ఈ సినిమా చూసినప్పుడు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధిమేర నటించారు. ఈ చిత్రానికి ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆయన పాటలు వెనుముక లాగ నిలిచాయి.

చివరిమాట :

చాలా కాలం తర్వాత రజినీకాంత్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ కంటెంట్. దీనిని ప్రేక్షకులు ఏ రేంజ్ కి తీసుకెళ్తారో చూడాలి.

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here