చిరంజీవి రీల్ కూతురేంటి.. బాబోయ్ ఇంత హాట్ గా ఉంది?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా గుర్తుందా. దాంట్లో అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ చాలా క్యూట్ గా డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ముగ్ధులను చేసిన చిన్నారి గుర్తుకు వచ్చే ఉంటుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా డాడీ.. ఈ సినిమాలో మెగాస్టార్ తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టి క్లాసికల్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరు ముద్దుల కూతురుగా నటించిన అనుష్క మల్హోత్రాను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

చిరంజీవి
చిరంజీవి

అక్షయ, ఐశ్వర్యగా ‘డాడీ’ సినిమాలో ఆమె కనిపించింది. అప్పటికి అనుష్క వయసు కేవలం నాలుగేళ్లు. అంటే ప్రస్తుతం బుడ్డదాని వయసు సుమారు 27ఏళ్లు వచ్చి ఉంటాయి. ముంబైలో పుట్టి పెరిగిన అమ్మడు ప్రస్తుతం ఇండియాలో లేదు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పేరెంట్స్ తో కలిసి ఉంటుంది. అక్కడే తన చదువులను పూర్తి చేసింది. లండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌గా జాబ్ చేస్తోంది.

నిజానికి ఆ సినిమా తరవాత అనుష్క మల్హోత్రాకు తెలుగు, హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్‌ కంటే బాలీవుడ్లోనే తాను ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆ సమయంలో తమ బిడ్డ చదువు పాడవుతుందని అనుష్క పేరెంట్స్ సినిమాలకు దూరం చేశారు. దీంతో తాను చదువులకే పరిమితం అయింది. కుటుంబం కూడా బర్మింగ్‌హామ్ వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం తనకు హీరోయిన్ గా చేసేందుకు ఛాన్సులు కూడా వచ్చాయట.

- Advertisement -

కానీ మళ్లీ ఇండస్ట్రీలోకి రావడానికి ఆమెకు ఇష్టం లేదట. నిజానికి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన వారు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. రాశి, మీనా, కీర్తి సురేష్, నిత్యా మీనన్, అవికా గోర్, శ్వేతాబసు ప్రసాద్, హన్సిక అలా వచ్చిన వారే. సినిమాలకు దూరంగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ తను గుర్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం హీరోయిన్లకు పోటీ వ‌చ్చేలా ఉన్న అందం.. ముక్కు పుడకతో కత్తి లాంటి ఫోటోస్ షేర్ చేసి కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CuzJIk1NIdy/?img_index=2

https://www.instagram.com/reel/Cc5t1GkqR72/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here