సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడిగా అంచెలంచెలుగా సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. మహేశ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఆయన అభిమానులకు ఆ రోజు పండగే. సినిమా హాళ్ల దగ్గర జాతర జరుగుతుంది. ప్రస్తుతం మహేశ్ బాబు తన 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో నేడు ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ ఇటు సినిమాలు అటు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా భారీగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా పలు బిజినెస్ లు కూడా నిర్వహిస్తున్నారు. మహేశ్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 25ఏళ్లు అవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారీ సినిమా మహేశ్ కు అంతులేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత మహేశ్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించారు. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో మహేశ్ కు క్రేజ్ ఉంది.
మహేశ్ హీరోగా నెక్స్ట్ లెవెల్ లో పోకిరి ఇండస్ట్రీ హిట్ సాధించింది. కలెక్షన్లలో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తర్వాత దూకుడు, బిజినెస్ మెన్, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇప్పటి వరకు మహేశ్ 27 సినిమాలు చేశారు. తాను ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ గా దాదాపు 80 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. యాడ్స్ ద్వారా కూడా సుమారుగా ఏడాదికి రూ.60 కోట్ల వరకు సంపాదిస్తున్నారట.
తండ్రి వారసత్వంగా ఎలాంటి ఆస్తులు తీసుకోలేదట. మహేశ్ బాబుకు తన భార్య నమ్రతనుంచి సుమారుగా రూ.2000 కోట్ల విలువైన ఆస్తి వచ్చినట్టు సమాచారం. మహేష్ బాబు సినీ కెరియర్లో సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఇళ్లే రూ.50 కోట్లు ఉంటుందట. దాదాపు రూ.35 కోట్ల విలువైన కార్లు ఉన్నట్లు సమాచారం. అలాగే తన దగ్గర రూ.3 కోట్ల విలువ చేసే బైక్ కూడా ఉంది. అన్నింటినీ లెక్కిస్తే మహేశ్ బాబు దాదాపు 13వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారట.