మరోసారి హాట్ టాపిక్ అవుతున్న యాంకర్ వర్షిణి పెళ్లి.. వరుడు ఇతడేనా

- Advertisement -

బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ వర్షిణి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. గతంలో వీరిద్దరూ ఢీ షో లో టీమ్ లీడర్లుగా కనిపించారు. మరోవైపు సుధీర్, రష్మి ఉండేవారు. ఇతర టీవీ కార్యక్రమాల్లోనూ వర్షిణి కనిపిస్తూ ఉండేది. ఆది, వర్షిణి మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. నిజానికి అందరితోనూ వర్షిణి బాగుంటుంది. వివాదాల్లోకి పెద్దగా వెళ్లదు. ఆ విషయం పక్కన పెడితే.. కొన్ని రోజులుగా.. ఓ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

యాంకర్ వర్షిణి
యాంకర్ వర్షిణి

ఆది కెరీర్ మెుదట్లో ఓ యాంకర్ చాలా సపోర్ట్ గా నిలిచిందని, ఆమెతో మంచి స్నేహం కుదిరిందని చాలా వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే థంబ్ నెయిల్స్ తో ఊదరగొట్టాయి. మెుదట ఆ యాంకర్ తో స్నేహంగా ఉండి.. తర్వాత ప్రేమలో పడ్డాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక కొంతమంది అయితే పెళ్లి తేదీలు కూడా ఫిక్స్ చేసేశారు. కానీ ఇందులో నిజం లేదని పక్కాగా తెలుస్తోంది. వర్షిణి పెళ్లి మణికంఠ(ఢీ షో డ్యాన్సర్ మణికంఠ కాదు) అనే డైరెక్టర్ తో అని టీవీ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. ఈ మణికంఠ మల్లెమాలలో క్రియేటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.

మరికొన్ని రోజుల్లో అందులో నుంచి బయటకు వస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే శ్రీపాద అనే డైరెక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడట. మణికంఠ కూడా.. మల్లెమాల టీమ్ నుంచి బయటకు వస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడట. ఇక మల్లెమాల సంస్థ కూడా.. ప్రోగ్సామ్స్ టీఆర్పీల పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ సెట్ అయ్యాక.. మణికంఠ, వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఓ చర్చ అయితే ఉంది. ఈ విషయం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి అనేది మాత్రం నిజం కాదు. హైపర్ ఆది టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు జనసేన పార్టీ సమావేశాలకు కూడా వెళ్లి స్పీచ్ ఇస్తున్నాడు. దీంతో ఆది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడని చర్చ కూడా ఉంది. తాను మాత్రం పవన్ కల్యాణ్ కు విరాభిమాని, ఆయన చూపే మార్గంలో వెళ్తానని ఆది చెబుతుంటాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here