అమాయక చిరునవ్వుతో కట్టిపడేసే సాయి పల్లవిని ఇష్టపడని వారు ఉండరేమో. ఈ మధ్య సాయి పల్లవి చాలా తక్కువ సినిమాలను అంగీకరిస్తోంది. పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి ఆమె స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. ఆమె సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. డాక్టర్ కావాలని కలలు కన్న సాయి పల్లవి.. సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లి డాక్టర్ వృత్తిని చేపట్టబోతోందని కూడా వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఆమె ఏం స్పందిచలేదు. నటిస్తూనే ఉంది.
కమర్షియల్ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు సాయి పల్లవి. సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి తన వ్యక్తిగత జీవితంలో కూడా భిన్నంగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమెకు చెందిన ఓ వీడియో వైరల్ అయింది. ఓ సినిమా షూటింగ్ లో సాయి పల్లవి గర్భంతో ఉన్న సీన్ తీస్తున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ అది సినిమాలోని సీన్ అని తెలిసి.. సైలెంట్ అయ్యారు. 1990లో జన్మించిన నటి సాయి పల్లవి పెళ్లి గురించి కిందటి ఏడాది బాగా చర్చ జరిగింది. పెళ్లికి సిద్ధమైందని, సినిమాల్లో నటించడం అనుమానమేనని వైరల్ అయింది.
సాయి పల్లవికి తగిన వరుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లిపై సస్పెన్స్ ఉంచింది ఫిదా బ్యూటీ. ఇక సాయి పల్లవి అలవాటు విషయానికి వస్తే.. ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది. సాయి పల్లవికి ఉ్నన విచిత్రమైన అలవాటు విభూతి తినడం. తనకు విభూతి అంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ తన బ్యాగ్‌లో పెట్టుకుంటానని తెలిపింది. తాను తినే విభూతి మాములుది కాదని, ప్రత్యేకమైన చెక్కతో తయారు చేయబడిందని, చాలా రుచిగా ఉంటుందని వెల్లడించింది సాయి పల్లవి.