టాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చాలా కాలం పాటు అన్యోన్యంగా ఉంటున్న జంటల్లో నాగార్జున, అమల దంపతులు ముందుంటారు. వెంకటేష్ సిస్టర్ లక్ష్మీతో విడిపోయిన తర్వాత నాగ్ అమలతో ప్రేమలో పడిపోయాడు. గతంలో వీరిద్దరూ కలిసి కిరాయి దాదా, శివ సినిమాలు చేశారు, అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇక శివ సినిమా అయితే ఆల్ టైం ఫేవరెట్. ఈ సినిమా తీస్తున్న టైంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లారు. 1992లో పెళ్లి చేసుకున్నారు. అయితే యువసామ్రాట్ నాగ్ అమల గర్భిణీ రోజులను గుర్తు చేసుకున్నారు. అదే విషయాలను అభిమానులతో పంచుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, రూప కలిసి నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి నాగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్ర బృందానికి విషెష్ చెబుతూ తన వంతు ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ట్రైలర్ బాగుందని అసలు మగవాడు ప్రెగ్నెంట్ కావడమనే కొత్త ఆలోచన జనాల్లో క్యూరియాసిటీ నింపుతుందన్నారు. ఇది ఎలా సాధ్యమనేది తెలుసుకునేందుకు తాను సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మాతృత్వపు అనుభవాల గురించి పంచుకున్నారు. నాగార్జున మాట్లాడుతూ.. అమ్మతనం అనేది అందమైన అనుభూతి అని పేర్కొన్నాడు. తాను హలో బ్రదర్ సినిమా తీస్తున్నప్పుడు అమల ప్రెగ్నెంట్. త్వరత్వరగా హలో బ్రదర్ ను కంప్లీట్ చేసుకుని ఆఖరి ఆరు నెలలు అమలతోనే ఉన్నానన్నారు. చివరకు తాను డెలివరీ అయ్యే వరకు తన చేతిని విడువలేదని చెప్పారు. తన జీవితంలో ఏదైనా గొప్ప అనుభవం ఉంటే అది ఇదేనని చెప్పుకొచ్చారు నాగార్జున.