తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగానే కాకుండా ఓ రచయితగా, దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనకు ప్రత్యేక అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కొన్ని సినిమాల్లో ఆయన నటనలో జీవించేశారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని వందల సినిమాల్లో నటించారు. తన కెరీర్ మొదట్లో విలన్ క్యారెక్టర్లకే పరిమితమై.. రాను రాను తనలోని రచయితను, దర్శకుడిని వెలికి తీశారు. కొన్ని కొన్ని పాత్రలను చూస్తే ఆయన క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా అనిపిస్తుంద
ఆ పాత్రలను చూసినప్పుడు తనికెళ్ళ భరణి ని మహిళలు ఆడిపోసుకునే వాళ్లు. అంతలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు ఆయన. తన పాత్రతోనే సినిమా సూపర్ హిట్ అయ్యేది. అంతలా నటించి ప్రేక్షకులను మెప్పించేవారు. ఇటీవల తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఓ సారి మహిళలు కొట్టడానికి వచ్చారన్న విషయం బయటపెట్టారు. మాతృదేవోభవ సినిమాలో తనికెళ్ల భరణి విలన్ వేషం వేశారు. ఆ సినిమాలో హీరోయిన్ ను ఏడిపించే సీన్ ఉంది. ఆ పాత్రలో హీరోయిన్ మాధవి పట్ల చాలా కిరాతకంగా ప్రవర్తించారు. దాంతో ఆ సినిమా ఆ సమయంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసిన మహిళలను తన పాత్ర చూసి బయట కనిపించినప్పుడు కొంతమంది కోపంతో తిట్టేవారట.. కొందరైతే ఏకంగా కొట్టడానికే వచ్చారట.. అంతలా తన నటన వారిని ప్రభావితం చేసిందంటూ ఆయన చెప్పుకొచ్చారు.