Chiranjeevi : చెన్నై లో మెగాస్టార్ చిరంజీవి కి అప్పట్లో హనీ హౌస్ అని ఒక గెస్ట్ హౌస్ ఉండేది. చెన్నై లో ఉన్నన్ని రోజులు చిరంజీవి కి ఆయన కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా అక్కడే జరిగేవి. చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కూడా ఆ హౌస్ లోనే జరిగేవి. అయితే ఎప్పుడైతే ఆయన హైదరాబాద్ కి తన కుటుంబం మొత్తాన్ని షిఫ్ట్ చేసాడో, అప్పటి నుండి ఆ హనీ హౌస్ ని వాడడం బాగా తగ్గించేసాడు.
ఎప్పుడైనా పని మీద చెన్నై కి వెళ్ళినప్పుడు హనీ హౌస్ వైపు ఒక లుక్ ఎయ్యడమే కానీ, ప్రత్యేకమైన శ్రద్ద మాత్రం చూపించేవాడు కాదు. అయితే చిరంజీవి హైదరాబాద్ కి వచ్చేసిన తర్వాత హనీ హౌస్ ని షూటింగ్స్ కి అద్దెకి ఇచ్చేవాడు. అలా గడిచిన మూడు దశాబ్దాల నుండి ఈ హౌస్ లో ఎన్నో షూటింగ్స్ జరిగాయి. ఈ హౌస్ లో షూటింగ్స్ ని పూర్తి చేసుకున్న ప్రతీ సినిమా సూపర్ హిట్స్ గా నిల్చాయట.
అందులో ఎక్కువ హిట్స్ నందమూరి బాలకృష్ణ కి ఉండేవట. బాలకృష్ణ సినిమాలు అంటే కచ్చితంగా ఫైట్స్ ఉండాల్సిందే, కానీ ఎలాంటి ఫైట్ సన్నివేశాలు లేకుండా, షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఏకైక బాలకృష్ణ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం. ఈ సినిమా అప్పట్లో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడమే కాకుండా, అప్పట్లోనే 40 కి పైగా కేంద్రాలలో వంద రోజులను పూర్తి చేసుకుంది.
ఈ సినిమా మాత్రమే కాదు, ఎన్టీఆర్ మేజర్ చంద్ర కాంత్, హలో బ్రదర్, గొప్పింటి అల్లుడు , సుస్వాగతం, గోకులం లో సీత, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈ ఇంట్లోనే షూటింగ్స్ ని జరుపుకున్నాయి. అలా చిరంజీవి గెస్ట్ హౌస్ అప్పట్లో షూటింగ్స్ కి ఫేమస్ గా నిలిచేది. ఆ ఇంటిని మీరు కూడా ఈ క్రింది వీడియో లో చూసేయండి.