మనం కట్టుకున్న ఇల్లు అంటే దానిపై మనకు ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అది కూడా ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి మొదటిసారి కట్టుకున్న ఇల్లు అంటే ఏ రేంజ్ సెంటిమెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమందికి ఇల్లు కట్టుకున్నాక కలిసి వస్తుంది అదే కొంతమందికి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకే కాదు సెలబ్రిటీలకైనా తప్పదు అని శివ జ్యోతిని చూస్తే అర్థమవుతుంది.
ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్ముకోవాలా అని బాధపడుతున్న శివజ్యోతి ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా శివ జ్యోతి కేం తక్కువ. సెలబ్రిటీ అయింది ,యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది ,కమర్షియల్ యాడ్స్ లో నటిస్తోంది. బాగానే సంపాదిస్తుందిగా.. రీసెంట్ గా బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నది. మరి ఇంత హ్యాపీగా ఉన్నా శివ జ్యోతి కి ఇల్లు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఎవరికైనా అనుమానం కలగక మానదు.
నిజానికి పైకి నవ్వుతూ కనిపించిన శివ జ్యోతి చాలా కష్టాలు అనుభవిస్తుంది. రీసెంట్ గా తన హోమ్ టూర్ వీడియోని అప్లోడ్ చేసిన శివ జ్యోతి ఒక సందర్భంలో ఎమోషనల్ అయింది. ఇంటి వల్ల తనకు ఎంతో కలిసి వచ్చిందని ,ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే తను బాగా సంపాదించిందని ,అవకాశాలు కూడా బాగా వచ్చాయి అని శివ జ్యోతి చెప్పింది. ఇల్లు కొనే సమయానికి ఒక ప్రముఖ ఛానల్లో ఎన్నో ఈవెంట్లు మరియు యాంకర్ గారి జీతం అన్ని ఉండడంతో ధైర్యంగా ఇల్లు కొనింది.
తన దగ్గర ఉన్న డబ్బే కాక బ్యాంకులో లోన్,అలాగే తెలిసిన వారి దగ్గర రెండు లక్షలు అప్పు చేసి మరి ఇల్లు కొనుక్కుంది. అయితే పాపం ఇంట్లోకి వెళ్లిన నెల పూర్తికాకముందే కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి పడింది. ఓడలు బండ్లైన సమయం అది.. ఆ కష్టాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో మనలో చాలామంది అనుభవించాం కూడా. అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్న శివ జ్యోతి ఈఎంఐ ఎలా కట్టాలి ?ఎలా బతకాలి ? అన్న బాధతో ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట.
ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఎంతో కష్టపడి మూడు నెలలు నడిపించి నష్టాలు తట్టుకోలేక ఇక ఆపేద్దామనుకుంటున్నట్లు శివ జ్యోతి వెల్లడించింది. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత మరొక ఇల్లు అవసరం లేదు అనిపించడం, అలాగే రెండు ఇళ్లకు ఈఎంఐలు కట్టడం భారంగా మారడంతో ఇల్లు అమ్మేయాలనుకుంటున్నట్టు చెప్పి కన్నీరు పెట్టుకుంది. తనకు బాగా అచ్చి వచ్చిన ఇంటిని ఇలా అమ్మాల్సి వచ్చినందుకు బాధగా ఉంది అని చెబుతూ శివ జ్యోతి ఏడ్చేసింది. ఆమె కష్టం చూసిన అభిమానులు కూడా ఎంతో బాధపడుతున్నారు.