మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆరోజుల్లో తమిళ సినిమా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది. వరదలతో తమిళనాడు మొత్తం అతలాకుతలం అవుతున్న రోజుల్లో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
అలాంటి సినిమాని మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ గా తీసుకొని రీమేక్ చేసాడు. పైగా కెరీర్ లో ఒక్క హిట్ సినిమా కూడా తియ్యని మెహర్ రమేష్ తో చెయ్యడం ఆశ్చర్యార్ధకం. కానీ ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలను ఏర్పాటు చేశాయి.
ఇకపోతే ఈ సినిమాకి ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు . సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. వాళ్ళ నుండి వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ కి ఫెస్టివల్ లాగ మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయిందని, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ తో పర్ఫెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని.
కచ్చితంగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో వంద కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన సినిమాగా నిలుస్తాడని, ఫ్యాన్స్ అందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని అంటున్నారు. త్వల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా హైదరాబాద్ లో జరపబోతున్నారని. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని ఒక టాక్ ఉంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.