Varun Tej : రాచరిక పద్ధతిలో వరుణ్-లావణ్యల పెళ్లి.. వెడ్డింగ్ ప్లానర్ కూడా రెడీ!

- Advertisement -

Varun Tej : ఇటీవల డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ట్రెండ్ గా మారింది. ఎక్కడ చూసినా చాలా మంది ధనవంతులు, సెలబ్రెటీలు ఈ తరహా పెళ్లిళ్లు చేసుకోవాలని కోరుకుంటున్నారు. విదేశాల్లో లేదంటే జైపూర్ లాంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా చేరారు. ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అందుకు వారు వెడ్డింగ్ ప్లానర్లను కూడా నియమించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Varun Tej
Varun Tej

జూన్ 9న హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట సడెన్ గా పెళ్ళి వార్త చెప్పి షాకిచ్చారు. ఇక వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ జరిగినప్పటినుండి పెళ్లి ఎక్కడ జరగనుంది? ఎలా జరగనుంది అనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ జంట పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలో అదికూడా రాచరిక పద్దతిలో జరుగనుంది. ఇటలీలో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఎంతో ఘనంగా జరగనున్న ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి కేవలం 50 మంది మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉండనుందని తెలుస్తోంది.

ఇక ఇటలీలోనే ఈ పెళ్లి చేసుకోవడానికి కూడా ఓక రీజన్ ఉంది. వరుణ్, లావణ్య మొదటిసారి కలిసి నటించిన మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఆ షూటింగ్ సమయంలోనే మొదటిసారి ఈ జంట కలుసుకున్నారట. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట వరుణ్ లావణ్య. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here