Indraja : ఈటీవీ లో ప్రసారమయ్యే షో లలో మంచి గుర్తింపు జబర్దస్ , ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ మరియు శ్రేదేవి డ్రామా కంపెనీ లు ఎంతగా మంచి గుర్తింపు తెచుకున్నాయో అందరికి తెలుసు . ప్రతి ఒక్కరికి కాస్త టైం దొరికితే యు ట్యూబ్ లో ఈ షో ల కామెడీ లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు . వీటిలో జడ్జి గా వ్యవహరించే వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అని అందరికి ఉన్న సందేహం . వీటికి చాలా మంది జడ్జి లుగా వచ్చారు , వెళ్లారు . కానీ ఎక్కువ కాలం నిలిచింది మాత్రం రోజా ,నాగబాబునే.
వీళ్లు ఉన్న సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట. వారి తరవాత వారికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వటం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందో అనే విషయం గురించి చెప్పుకుంటే… ఒక్కో ఎపిసోడ్ కి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంద్రజతో పాటు కృష్ణ భగవాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి కూడా 2.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.
జబర్దస్త్ లో రోజా,నాగబాబు ఉన్నప్పుడు వారు ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరకు తీసుకొనేవారని సమాచారం. వీరితో పోలిస్తే ఇంద్రజ,కృష్ణ భగవాన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఇంద్రజ సినిమాల్లో మంచి పాత్ర వస్తే చేస్తుంది. అలాగే సినిమాలలో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఎందుకంటే సినిమాల్లో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుంది . ఇంద్రజ ఒకప్పుడు టాప్ హీరొయిన్ గా ఉండేది. ఇప్పుడు ఇలా జబర్దస్త్ లోకి వచ్చి అభిమానులకు దగ్గర అయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.