Chiranjeevi : మెగా అల్లుడు కాబోతున్న హీరో తరుణ్..? త్వరలోనే సంచలన ప్రకటన!

- Advertisement -

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో గౌరవప్రదమైన స్థానం లో ఉన్న రెండు మూడు కుటుంబాలలో ఒకటి మెగా ఫ్యామిలీ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి తన సొంత కష్టం మీద వచ్చిన ప్రతీ అవకాశం ని వాడుకుంటూ హీరో గా మారి మెగాస్టార్ రేంజ్ కి ఎదిగి, నెంబర్ 1 హీరో గా సుమారుగా మూడు దశాబ్దాలు కొనసాగాడు.

Chiranjeevi
Chiranjeevi

ఇక ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , వీళ్లంతా కూడా హీరోలుగా సక్సెస్ అయ్యి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ ఈ పేరు ప్రతిష్టలను మొత్తం చిరంజీవి చిన్న కూతురు మంటగల్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇంట్లో చెప్పకుండా లేచి వెళ్లి పెళ్లి చేసుకొని పెద్ద సెన్సేషన్ ని సృష్టించింది.

ఆ తర్వాత చిరంజీవి జరిగింది మొత్తం మర్చిపోయి కూతురు ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి రెండవ పెళ్లి చేసాడు. కానీ శ్రీజా కళ్యాణ్ దేవ్ తో కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడు రీసెంట్ గా నిహారిక కొణిదెల కూడా విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో విషయాల్లో ఆదర్శంగా ఉండే మెగా ఫ్యామిలీ పెళ్లిళ్ల విషయం లో మాత్రం చెడ్డ పేరు ని తెచ్చుకుంది. ఇకపోతే సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ప్రముఖ హీరో తరుణ్ త్వరలోనే మెగా కుటుంబానికి అల్లుడు కాబోతున్నాడని ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

- Advertisement -

అయితే ఆయన నిహారిక ని పెళ్లి చేసుకుంటాడా?, లేదా శ్రీజా ని పెళ్లి చేసుకుంటాడా? అనే దాని మీద క్లారిటీ లేదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తరుణ్ తల్లి రోజా రమణి , మీ కొడుకుకి పెళ్లి ఎప్పుడు చెయ్యబోతున్నారు అని అడగగా, కచ్చితంగా త్వరలోనే చేస్తాను, ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయే కోడలుగా రాబోతుంది అని చెప్పుకొచ్చింది. అప్పటి నుండి సోషల్ మీడియా లో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here