నిన్నటి తరం హీరోలలో టాలీవుడ్ టాప్ 2 ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్పగలరు అది చిరంజీవి , బాలకృష్ణ అని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మెగాస్టార్ గా చిరంజీవీ ఎదిగితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు మహానటుడు నందమూరి తారకరామారావు గారు కుమారుడిగా నందమూరి బాలకృష్ణ అడుగుపెట్టాడు.
చిరంజీవి మీద ప్రారంభం లో ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు ప్రేక్షకుల్లో. కానీ బాలయ్య ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఆయనపై మొదటి సినిమా నుండే తీవ్రమైన ఒత్తిడి ఉండేది. అయితే బాలయ్య ఆ ఒత్తిడి ని తట్టుకొని, త్రండ్రికి తగ్గ త్తనాయుడు అనిపించుకుని , తన స్టైల్ లో సరికొత్త సినిమాలు చేస్తూ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టి కొట్టి టాలీవుడ్ టాప్ 2 స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు.
అలా రికార్డ్స్ లో కానీ , ఫ్యాన్ ఫాలోయింగ్ లో కానీ నువ్వా నేనా అనే రేంజ్ లో ఉండే చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే చూడాలని అభిమానులు చాలా కాలం నుండి కోరుకుంటున్నారు. ప్రస్తుతం మల్టీస్టార్రర్ మూవీ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న ఈ సందర్భం లో ఎప్పుడో ఒకసారి వీళ్లిద్దరి భవిష్యత్తులో కలిసి నటించొచ్చు ఏమో కానీ, అప్పట్లో మాత్రం వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభమై 50 శాతం వరకు షూటింగ్ ని జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా పేరు ‘అపూర్వ సహోదరులు’. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం 50 శాతం వరకు షూటింగ్ జరుపుకొని, ఎందుకో కొన్ని కారణాల చేత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇక తర్వాత బాలయ్య బాబు తో ద్విపాత్రాభినయం వేయించి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. ఈ చిత్రం ఆ రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యూట్యూబ్ లో ఈ సినిమా ఇప్పటికీ అందుబాటులో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్లి చూడండి, రెండవ బాలయ్య పాత్ర లో చిరంజీవి ని ఊహించుకొని చూసి, ఈ చిత్రం వాళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కి ఉంటే ఎలా ఉండేదో కామెంట్స్ రూపం లో తెలియచేయండి.