‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో మహేష్ బాబు కూతురు సితార..? ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే న్యూస్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతకాలం క్రితమే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల తాత్కాళికంగా బ్రేక్ పడింది.

ఉస్తాద్ భగత్ సింగ్
ఉస్తాద్ భగత్ సింగ్

ఆగస్టు నెలలో కానీ , సెప్టెంబర్ నెలలో కానీ, ఈ సినిమాకి సంబంధించిన రేగుల్లర్ షూటింగ్ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలం క్రితమే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మరోసారి భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని ఈ టీజర్ ని చూసినప్పుడే అర్థం అయ్యింది. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒక హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

ఇక పోతే ఈ చిత్రం లో ఒక చిన్న పాప పాత్ర కోసం గత కొంతకాలం గా కొంతమంది పేర్లని పరిశీలిస్తున్నారు. వారిలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ని తీసుకుందామని ముందుగా అనుకున్నారు. అప్పట్లో దీని గురించి సోషల్ మీడియా లో పెద్ద చర్చే నడిచింది. కానీ ఇప్పుడు ఈమె స్థానం లో మహేష్ బాబు కూతురు సితార ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్.

- Advertisement -

రీసెంట్ గానే సితార కి సంబంధించిన ఒక యాడ్ కూడా టెలికాస్ట్ అయ్యింది . దీనికి ఫ్యాన్స్ నుండి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ యాడ్ చూసిన తర్వాతే హరీష్ శంకర్ కి ఆలోచన తట్టినట్టు తెలుస్తుంది. అయితే మహేష్ బాబు సితార ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం మహేష్ – పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here