Bro Movie : పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అతని సినిమా వస్తుంది అంటే వైసిపి నేతలు గుండెల్లో దడ మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువగా వారిని టార్గెట్ చేసి పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కుమ్మేస్తున్నాడు మరి. కాస్త గ్యాప్ తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా దగ్గర నుంచి భీమ్లా నాయక్ వరకు ఎన్నో డైలాగ్స్ వైసీపీ నేతలను ఉతికి ఆరేసే విధంగా ఉన్నాయి.
శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు అనే డైలాగ్ అయితే నేరుగా ఏపీ సీఎం జగన్ తో పాటు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి వాడి ముల్లులా తగిలాయి. ఇలా తన వాడి మాటలతో రూలింగ్ పార్టీని ఉతికి ఆరేయడం పవన్ కు అలవాటుగా మారింది. వారాహి యాత్రలో పవన్ దాడి మరీ పిక్స్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. ఒకపక్క వారాహి యాత్ర మరో పక్క ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో విడుదలైన బ్రో చిత్రం లో పవన్ వైసీపీ నేతలను ఓ రేంజ్ లో విమర్శించి వదిలాడు.
ఇక ఎప్పుడూ పవన్ పై ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్ లో విమర్శలు కురిపించే ఓ మినిస్టర్ ను పవన్ కళ్యాణ్ మాస్ రాగింగ్ చేశారు. ఏపీ ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆ సదరు మంత్రి ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జనాలతో డాన్స్ చేశారు. అంబటి రాంబాబును గుర్తుచేసేలా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తి చేసి…పృధ్వి డాన్స్ మీద పవన్ సెటైర్ల వర్షం కురిపించాడు. ఇది తానే అని ఆ మంత్రికి తెలిసే విధంగా ఎటువంటి టీషర్టు అతను ధరించాడు అదే లాంటి టీ షర్ట్ ని పృథ్వి తో వేయించారు కానీ క్యారెక్టర్ పేరు మాత్రం శ్యాంబాబు అని పెట్టారు.
దీంతో పవన్ మాస్ ర్యాగింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లలో రికార్డ్ చేసి ఈ వీడియోని ఈ సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పై ఇంకా ఏపీ మంత్రి న ఎలా స్పందిస్తాడు అనే విషయం వేచి చూడాలి. ఇది ఒక్కటే కాదు బ్రో మూవీ లో డైరెక్ట్ గా , ఇన్ డైరెక్ట్ గా పవన్ తన డైలాగ్స్ తో వైసీపీ ప్రభుత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు.