Niharika : రీసెంట్ గా విడాకులు తీసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నిహారిక. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి మరో వార్త బయటకు వచ్చింది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేని ఓ పని చేసేందుకు సిద్ధమైందట. వారు వద్దని చెప్పినా వినలేదట. వివరాళ్లోకి వెళితే.. ఆ మధ్యలో మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కు కూతురు పుట్టిన శుభవార్త అలా విన్నామో లేదో.. అంతలోనే ఆ కుటుంబం నుంచి మరో చేదు వార్త కూడా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే నిహారిక డివొర్స్. ఆమె తన భర్త చైతన్య జొన్నల గడ్డ నుంచి ఇటీవలే విడాకులు తీసుకుని చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని మెగా అభిమానులు మర్చిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి వార్తలు తగ్గాయి. అయితే మళ్లీ నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. చైతన్యతో దూరంగా ఉండటం మొదలు పెట్టాక.. ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇది అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. వాస్తవానికి ఆమె మొదట ఇండస్ట్రీలోకి హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం ప్రారంభించింది. అడపాదడపా చిత్రాలను రూపొందించింది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలిసింది.
ఈ విషయమే నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అవుతోంది. విడాకులు తీసుకున్నాక నిహారిక తన కాళ్ల మీద తాను నిలబడాలని చాలా గట్టిగా నిర్ణయించుకుందట. అలా తాను మళ్లీ హీరోయిన్ గా రావాలని ఫిక్స్ అయిందట. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగానే పట్టుదలతో ఉందని అంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చిందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేసేందుకు ఒప్పుకుందట. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఎటువంటి వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఓ మూవీకి కమిట్ అయిందని మాత్రం అంతా అంటున్నారు. ఈ విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిహారిక మళ్లీ సినిమా హీరోయిన్ గా రావడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. కానీ నిహారిక మాత్రం తన కాళ్లపై తాను నిలబడాలని, తన టాలెంట్ ను నిరూపించుకోవాలని భావిస్తోందట.