Mahesh Babu టాలీవుడ్ లో మల్టీస్టార్ర్ర్ సినిమాల ట్రెండ్ కి తెరలేపిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ వరుసగా మల్టిస్టార్రర్ సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ మహేష్ బాబు మాత్రం మళ్ళీ మల్టిస్టార్రర్ సినిమాల్లో కనిపించలేదు.
రాబొయ్యే రోజుల్లో ఆయన మల్టీస్టార్రర్ సినిమాలు చేయొచ్చేమో తెలీదు కానీ,ఇప్పటి వరకు అయితే చెయ్యలేదు. ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కి ఈ చిత్రమే చివరి బ్లాక్ బస్టర్. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ ఫలపు అవ్వడం తో మళ్ళీ ఆయన నుండి సినిమా రాలేదు.
ఇది ఇలా ఉండగా ఈ కథ రాసుకున్నప్పుడు శ్రీకాంత్ అడ్డాల ఒక హీరోగా వెంకటేష్ ని ఫిక్స్ చేసేసుకున్నాడు,ఇక మరో హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకుందాం అని అనుకున్నాడట. అప్పట్లో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది, ఈ క్రేజీ కాంబినేషన్ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడు అని వార్త వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ కి కాల్ షీట్స్ ఇచ్చేయడం వాళ్ళ ఈ చిత్రం చెయ్యలేకపోయాడు.
అలా ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేతి నుండి మహేష్ బాబు చేతికి వెళ్ళింది. ఆ రోజుల్లో ఈ సినిమా సుమారుగా 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే అప్పట్లో ఈ సినిమా ఓవర్సీస్ లో సునామి లాంటి వసూళ్లను రాబట్టింది. ఆ రోజుల్లోనే రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం..