Shiva Jyothi : యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది.
అయితే తాజాగా బోనాల పండుగ సందర్భంగా ఆమె ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. అందులో తన కోసం భర్త గంగూలీ కొన్న బంగారు నగలను చూపించింది. దీంతో జ్యోతి భర్త గంగూలీపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేశారు. అక్క మీ భర్త ఏం జాబ్ చేస్తారని ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు ఏ జాబ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్ చేశారు. అంతటితో ఆగని కొందరు ఇంతకూ మీరెప్పుడు పిల్లల్ని కంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారి మాటలను పట్టించుకోకూడదని శివజ్యోతికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే ఇలా తన ప్రెగ్నెన్సీ పై వార్తలు వచ్చిన ప్రతిసారి తాను మరింత ఎమోషనల్ అవుతానని ఇటీవల ఒక షోలో వెల్లడించింది శివ జ్యోతి.
మాకు పెళ్లయి చాలా సంవత్సరాలవుతుంది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ మాత్రమే కాదు మేము కూడా ఎంతో ఎదురు చూస్తున్నాము. ఇది ఎమోషనల్ గా నన్ను ఎంతో బాధ పెడుతోంది. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో అతిపెద్ద విషయం.. నాపై పర్సనల్‌గా, ప్రొఫెషనల్ గా తప్పుగా ప్రచారం చేయకండి. అది నాపై మరింత ఎఫెక్ట్ చూపిస్తోంది. మీ మాటల వల్ల నా గుండె మరింత బరువెక్కుతోంది అంటూ ఎమోషనల్ అయింది శివజ్యోతి. అయితే ఈమె బాధ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే తల్లి కావాలనే ఎమోషన్ ఉంటుంది. అందులో తప్పేముంది. దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా.. ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు మీరు పట్టించుకోకండి అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.