Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయిన మూవీ ‘బ్రో’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా వస్తుంది. తమిళ్ లో దర్శకత్వం వహించిన సముద్రఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి ‘బ్రో’ అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలియజేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ని బ్రో అని పిలుస్తుంటాడట. అందుకనే ఈ మూవీ ఆ టైటిల్ పెట్టినట్లు వెల్లడించారు. అలాగే ఓవర్సీస్ లో ఈ మూవీని కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదనే వార్తలు పై కూడా రియాక్ట్ అయ్యారు. “పవన్ కళ్యాణ్ సినిమాలు కొనడానికి బయ్యర్లు రాలేదనే మాటే అసలు ఉండదు. ఇప్పటికిప్పుడు హక్కులు ఇస్తామని ప్రకటిస్తే తీసుకోవడానికి ఎంతోమంది పోటీ పడతారు.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను మేమే ఎవరికీ ఇవ్వలేదు. ఈ మూవీ పై మాకున్న నమ్మకంతో సొంతంగా విడుదల చేయాలని అనుకున్నాం” అంటూ తెలియజేశారు.దీంతో మూవీ కొనడానికి బయ్యర్లు రాలేదన్న రూమర్స్ కి చెక్ పడింది. ఇక ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమే సజెస్ట్ చేసినట్లు కూడా నిర్మాత వెల్లడించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ (U) సర్టిఫికెట్ జారీ చేసింది. సంబంధిత ఫొటోని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దర్శకుడు సముద్ర ఖని, సంగీత దర్శకుడు తమన్ అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 16 నిమిషాలని సమాచారం.