Vijay Varma : తమన్నాతో రొమాన్స్ ఇప్పుడే మొదలు పెట్టా.. ప్రియుడు విజయ్ వర్మ

- Advertisement -

తమన్నా, నటుడు విజయ్‌ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి ప్రేమ గురుంచి మీడియాతో పాటు అభిమానులు కూడా నమ్ముతున్నారు. రీసెంట్ గా విజయ్, తమన్నా వారి మనసులో మాటను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే వీరిద్దరూ నిజంగా రిలేషన్‌లో లేరని, ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ ప్రచారం కోసం అలా చెప్పారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి చెక్‌ పెడుతూ తాజాగా విజయ్‌ వర్మ.. తమన్నాతో తన రిలేషన్‌ గురించి స్పందించారు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చెప్పారు.

Vijay Varma
Vijay Varma

‘‘మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె రాకతో నా జీవితంలో విలన్‌ దశ ముగిసిపోయి.. రొమాంటిక్‌ దశ మొదలైంది’’ అని చెప్పారు. దీంతో తమన్నాతో ఎంతలా ప్రేమలో ఉన్నాడో అందరికీ అర్ధమయింది. లస్ట్ స్టోరీ 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్‌తో తన రిలేషన్‌పై ఇటీవల తమన్నా స్పందిస్తూ.. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలానే ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే నాకు విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకు కష్టం వస్తే నాతోనే ఉంటాడనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.. దీంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Varma Thamannah

తాజాగా మరో విషయాన్ని కూడా విజయ్ వర్మ చెప్పాడు. ఒక సినిమాలో తన నటనను చూసి ఆడవాళ్లు తనని చంపాలని అనుకున్నారంటూ, షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇంతకుముందు ఆలియా భట్ విజయవర్మ కలిసి డార్లింగ్స్ అనే చిత్రం చేశారు. ఈ చిత్రంలో అలియా భట్ విజయ్ వర్మ భార్యాభర్తలు. విజయవర్మ భార్యని టార్చర్ చేసే పాత్రలో కనిపిస్తారు. ఈయన చేసిన యాక్షన్ చూసి చాలామంది ఆడవాళ్లు ఇలాంటి భర్త ఉంటే చావడం మేలు అన్నారట. ఏకంగా కొంతమంది ఆడవాళ్లు అయితే నీలాంటి వాళ్ళని చంపేయాలి అని కూడా అన్నారట. కాకపోతే కొంతమంది మాట్లాడిన మాటలు బట్టి భర్త ఎంత టార్చర్ చేసినా కూడా వారు ఆనందంగా భరిస్తారు, అంటూ ఆయన వివరించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here