Pawan Kalyan : దిల్లీ అందం… కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ… ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలతో యూత్‌లో గ్లామర్ డాల్‌గా క్రేజ్ సంపాదించుకుంది. ఆమె అందానికి యువత ఫిదా అయిపోయింది. అయితే అంతకన్నా ఎక్కువగా సోషల్‌మీడియాలో హాట్ హాట్ పోజులు ఇస్తూ మస్త్ ఫొటోషూట్స్‌తో బాగా ఆకట్టుకుంది. గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త పోజులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఈ క్రమంలోనే వైష్ణవ్ తేజ్‌తో కలిసి రంగ రంగ వైభవంగా చిత్రంలో నటించింది. కానీ ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయితేజ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించింది.

పవన్‌కల్యాణ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 28న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రంతో ఎలాగైనా గట్టి హిట్‌ను అందుకోవాలని ఆశిస్తోంది. దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. గ్లామర్ డాల్ కేతిక శర్మ తాజాగా ‘బ్రో’ సినిమాతో పాటు ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. మెగా హీరోస్ సాయితేజ్-వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడింది. అలాగే పవన్ కల్యాణ్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంది. వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నప్పుడు చివరి దశలో నాకు ‘బ్రో’ మూవీ ఛాన్స్ వచ్చింది.’బ్రో’ సినిమాలో సాయి తేజ్‌కు లవర్‌గా కనిపిస్తాను. నా పాత్ర నటనకు స్కోప్ ఉన్నదే. నాది మాత్రమే కాదు.. చిత్రంలోని పాత్రలన్నీ కూడా కథను ముందుకు నడిపిస్తాయి.

గుడ్ మెసేజ్ ఉన్న చిత్రమిది. సమయం గురించి ఈ చిత్రంలో చెప్పిన విషయాలు ఆలోచనని రేకెత్తిస్తాయి. అసలీ బ్రో సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ పవన్ కల్యాణ్. ఆయన పేరు వినగానే… ఇంకేమీ ఆలోచించలేదు. అయితే, ఆయన.. నేను కలిసి తెరపై కనిపిస్తాం కానీ.. ఇద్దరీ మధ్య సన్నివేశాలేమీ లేవు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాతోనే తొలిసారి ఆయన్ను కలిశాం. సాయి తేజ్ పరిచయం చేశాడు. పవన్‌తో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మంచి అనుభూతి కలిగించింది. ఇక వైష్ణవ్ తేజ్, సాయి తేజ్ ఇద్దరు సరదాగానే ఉంటారు. కానీ ఇద్దరిదీ భిన్నమైన వ్యక్తిత్వాలు. వైష్ణవ్‌కు చాలా మొహమాటం ఎక్కువ అనే చెప్పాలి. కాస్త చనువు పెరిగితే అప్పుడు సరదాగా ఉంటాడు.